Vinesh Phogat | భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్‌కు ఫైనల్ మ్యాచ్‌కు ముందు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహిళల 50 కేజీల వెయిట్ కేటగిరీ ఈవెంట్లో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ వ్యవహారంపై యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) చీఫ్ నెనాద్ లాలోవిచ్ స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ నిరాశను వ్యక్తం చేశారు. నిబంధనలు గౌరవించాలని.. వినేశ్ ఫోగట్ విషయంలో జరిగిన విషయంపై చింతిస్తున్నానన్నారు. బరువు తక్కువగానే ఉందని.. నియమాలు, ప్రతీది పబ్లిక్‌గా ఉంటుందన్నారు. సరైన బరువులేని వారిని పోటీ చేయడానికి అనుమతించడం అసాధ్యమన్నారు.
ఆమె ఫైనల్‌కు చేరినందున పతకం ఇవ్వడం అసాధ్యమన్నారు. ఏది ఏమైనా రూల్స్ ఈజ్ రూల్స్ అన్నారు. మంగళవారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వినేశ్ 5-0తో క్యూబాకు చెందిన లోపెజ్ గుజ్మన్పై విజయం సాధించి.. ఒలింపిక్ ఫైనల్‌కు చేరిన మహిళా రెజర్ల్గా రికార్డును నెలకొల్పింది. మొదట గుజ్మన్ లీడ్‌లో కనిపించినా.. చివరి మూడు నిమిషాల్లో క్యూ రెజర్లపై డబుల్ లెగ్ ఎటాక్ చేసి నాలుగు పాయింట్లు సాధించింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కొనసాగించి ఫైనల్‌కు చేరింది. ఈ ఒలింపిక్స్‌లో వినేశ్ ప్రయాణం అద్భుతంగా సాగింది. సెమీఫైనల్‌కు ముందు క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన లివాచ్ ఉక్సానాపై 7-5 తేడాతో విజయం సాధించింది.