Paris Olympics 2024 : భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) విశ్వ క్రీడల్లో అదరగొడుతోంది. 16వ రౌండ్లో వరల్డ్ నంబర్ 1ను చిత్తు చేసిన వినేశ్ క్వార్టర్స్‌లోనూ జోరు చూపించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. 50 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఉడుం పట్టుతో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ (Oksana Livach)ను మట్టికరిపించింది.
ఆరంభం నుంచి ప్రత్యర్థిని ముప్ప తిప్పలు పెట్టిన భారత రెజ్లర్ 7-5తో గెలుపొంది సెమీస్‌లో అడుగుపెట్టింది. దాంతో, ఇండియాకు కనీసం కాంస్యం ఖరారు చేసింది. ఫైనల్ బెర్తు కోసం ఆమె రాత్రి 10:15 గంటలకు తలపడనుంది.
🔥 Vinesh Phogat’s Olympic dream burns bright!
Phogat survives late surge from Oksana Livach, secures 7-5 quarterfinal victory.
Can she clinch a medal? Semifinal showdown awaits tonight!#Paris2024 #ParisOlympics2024 #Vineshphogat #ParisOlympics pic.twitter.com/jQsnOOll7G
— Khel Now (@KhelNow) August 6, 2024