Pushpa 2 The Rule | యూత్ క్రేజీ కథానాయకుడు అల్లు అర్జున్ (Allu arjun) నటిస్తున్న తాజా చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా ఎంటర్టైనర్గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ , అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్-సుకుమార్ (sukumar) కలయికలో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ పుష్ప పార్ట్ 1కు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. మొదట్లో ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్నారు.
అయితే ఇంకా షూటింగ్ పార్ట్ బ్యాలెన్స్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెండింగ్ వుండటంతో ఈ చిత్రాన్ని డిసెంబరు 6కు వాయిదా వేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషన్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్‌తో పాటు విడుదలైన రెండు పాటలకు అనూహ్య స్పందన వచ్చింది. అయితే ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే ఈ షూటింగ్‌లోనే దర్శకుడికి , హీరోకు విభేదాలు వచ్చాయని, అందుకే హీరోతో పాటు దర్శకుడు కూడా వేర్వేరుగా విదేశాలకు విహారయాత్ర వెళ్లారని న్యూస్ వచ్చింది.
అంతేకాదు హీరో, దర్శకుడి మీద కోపంతో గడ్డం తీసేశాడని ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని, అద్భుతమైన క్లైమాక్స్ ప్రేక్షకులకు, బన్నీ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పిసుందని అప్డేట్ను ఆఫీషియల్‌గా వదిలారు. ఈ పతాక సన్నివేశాలు, హీరో హీరోయిన్‌తోపాటు కొంత మంది కీలక పాత్రదారుల మీద చిత్రీకరస్తున్నారట.
ఈ ఏపిసోడ్ క్లైమాక్స్‌కు హైలైట్‌గా వుంటుందట. సో.. ఇక అందరి రూమర్లకు చెక్‌పెడుతూ అల్లు అర్జున్ పుష్ప-2 షూటింగ్లో పాల్గొంటున్నాడు. సో. అల్లు అర్జున్ అభిమానులు మరో బ్లాక్‌బస్టర్ కోసం వెయిట్ చేయడమే తరువాయి అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
NTR Neel | హమ్మయ్య.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా లాంచ్ డేట్ ఫైనల్..!