Vijay Shankar : రంజీ సీజన్ ప్రారంభానికి ముందే సొంత జట్టు అయిన తమిళనాడును వీడిన విజయ్ శంకర్ (Vijay Shankar) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. అసంతృప్తితోనే తాను కీలక నిర్ణయం తీసుకున్నట్టు ఈ ఆల్‌రౌండర్ తెలిపాడు. దులీప్ ట్రోఫీకి ముంది జట్టును వీడడానికి దారి తీసిన కారణాలను శంకర్ పంచుకున్నాడు. సెలెక్టర్ల తీరు నచ్చకపోవడం, పదే పదే తనను పక్కనపెట్టేయడం వంటివి చికాకు తెప్పించడం వల్లనే తాను తమిళనాడుకు బైబై చెప్పానని ఈ డాషింగ్ బ్యాటర్ వెల్లడించాడు.
కొన్నిసార్లు మనం ఇష్టంలేకున్నా సరే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. గతాన్ని మరచిపోయి కొత్త అవకాశాల్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. నేను బాగానే ఆడుతున్నాని నాకు తెలుసు. కానీ, జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఎంతో బాధించింది. బెంచ్ మీద ఖాళీగా ఉండడం, డ్రింక్స్ బ్రేక్‌లో నీళ్ల బాటిళ్లు మోసుకెళ్లడం నాకు చిరాకు తెప్పించాయి. కొన్నేళ్లు ఆడిన నాకు ఇవన్నీ చాలా కష్టంగా తోచాయి. నిరుడు రంజీ టోర్నీ మొదటి రెండు మ్యాచ్‌లకు నన్ను తీసుకోలేదు.
My journey with TNCA started 23 years ago when I first got picked for under-13 state and it has been a great ride with lots of memories and learnings!
Looking back, being a part of this team and leading the TN side to 3 major trophies was a dream come true! It has shaped me and… pic.twitter.com/j2shxbVgRe
— Vijay Shankar (@vijayshankar260) August 27, 2025
అయితే.. సయ్యద్ ముస్తాక్ అలీ (Syed Mushtaq Ali) టోర్నీతో మళ్లీ జట్టులోకి వచ్చాను. కానీ.. చివరి రెండు గేమ్‌లకు నన్ను తప్పించారు. అలా ఎందుకు చేశారో నాకు అర్ధం కాలేదు. స్క్వాడ్‌లో ఉన్నా తుది జట్టులో ఉండకపోవడం.. సెలెక్టర్లు నాకు స్పష్టత ఇవ్వకపోవడం వంటివి తమిళనాడు జట్టుకు నన్ను దూరం చేశాయి అని 34 ఏళ్ల శంకర్ తన ఆవేదనను వెల్లగక్కాడు.
🚨 REPORTS 🚨
Vijay Shankar is likely to play for Tripura in the upcoming domestic season. 🇮🇳🏆#Cricket #VijayShankar #TamilNadu #Sportskeeda pic.twitter.com/xoPYV8GPs9
— Sportskeeda (@Sportskeeda) August 27, 2025
ఈమధ్యే జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్లో శంకర్‌ను పక్కన పెట్టేశారు సెలెక్టర్లు. దాంతో, చిర్రెత్తుకొచ్చిన అతడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వాలని.. తాను కొత్త జట్టుకు ఆడాలని అనుకుంటున్నట్టు టీఎన్‌సీఏను కోరాడు. అతడి అభ్యర్థనను అంగీకరిస్తూ.. ఎన్ఓసీ మంజూరు చేసింది తమిళనాడు క్రికెట్ సంఘం. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ సీజన్లో శంకర్ త్రిపుర ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. ఆంధ్ర క్రికెట్ సంఘం(ACA) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్న హనుమా విహరి (Hanuma Vihari) సైతం ఇదే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. 2012 నుంచి తమిళనాడుకు ఆడుతున్న విజయ్ శంకర్ 81 రంజీ మ్యాచుల్లో.. 44.25 సగటుతో 3,142 రన్స్ సాధించాడు. నిరుడు సీజన్లో అతడు ఛండీగఢ్ మీద 150 పరుగులతో అజేయంగా నిలిచాడు.