WPL 2024 | ఆర్సీబీకి తొలి టైటిల్.. ఫ్రాంచైజీ ఫస్ట్ ఓనర్ రియాక్షన్ ఇదే..
WPL 2024 | స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే కప్పుకొట్టింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ యజమాని, ఈ ఫ్రాంచైజీ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా స్పందించాడు.
WPL 2024 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ట్రోఫీ (డబ్ల్యూపీఎల్) నెగ్గడంతో ఆ జట్టు అభిమానులు సంబురాల్లో మునిగితేలుతున్నారు. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లోనే కప్పుకొట్టింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీ మాజీ యజమాని, ఈ ఫ్రాంచైజీ వ్యవస్థాపకుడు విజయ్ మాల్యా స్పందించాడు. మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన మాల్యా.. మెన్స్ టీమ్ కూడా కప్ గెలిస్తే ఈసారి ఆనందం డబుల్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
మాల్యా ట్విటర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ… ‘డబ్ల్యూపీఎల్ ట్రోఫీ నెగ్గిన ఆర్సీబీ మహిళల జట్టుకు హృదయపూర్వక అభినందనలు. ఇదే స్ఫూర్తితో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పురుషుల ట్రోఫీ (ఐపీఎల్)ను నెగ్గితే ఈ ఆనందం డబుల్ అవుతుంది. గుడ్ లక్..’ అని పోస్ట్ చేశాడు.
Heartiest congratulations to the RCB Women’s Team for winning the WPL. It would be a fantastic double if the RCB Men’s Team won the IPL which is long overdue. Good Luck.
— Vijay Mallya (@TheVijayMallya) March 17, 2024
మాల్యా పెట్టిన ఈ పోస్ట్పై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ‘ఇప్పుడు మనం ఒక డీల్ చేద్దాం. ఒకవేళ ఐపీఎల్ -2024లో గనక ఆర్సీబీ గెలిస్తే నేను ఇండియాకు తిరిగివస్తా అని చెప్పేయండి. చూద్దాం అలా అయినా మీ పురుషుల జట్టు కప్పు కొడుతుందేమో..’, ‘పురుషుల జట్టా..? అంత సీన్ లేదు. అది అవ్వదులే గానీ మీ ఆనందం డబుల్ అవ్వాలంటే మళ్లీ అమ్మాయిలే నెక్స్ట్ సీజన్లో గెలవాలి..’ అని పోస్టులు చేస్తుండగా కొందరు.. ‘ఎస్బీఐ మీకోసం వెయిటింగ్ ఇక్కడ.. ఎప్పుడొస్తున్నారు..?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్యాంకులకు సుమారు రూ. 9వేల కోట్ల ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా.. చాలాకాలంగా యూకేలో ఉంటున్న విషయం విదితమే.
Vijay mallya to RCB mens team😂😭 pic.twitter.com/FHTehkg3wx
— AllHailTheTiger (@msdntr79) March 17, 2024
Meanwhile SBI 😹 pic.twitter.com/IW6zrQ6sgH
— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) March 17, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

