బెంగళూరు: ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని విదర్భ సొంతం చేసుకుంది. బెంగళూరులోని సీవోఈలో ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రను ఓడించి తమ తొలి హజారే ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఫైనల్లో అథర్వ (128), యశ్ రాథోడ్ (54) రాణించడంతో విదర్భ 317/8 స్కోరు చేసింది. ఛేదనలో సౌరాష్ట్ర.. 48.5 ఓవర్లలో 279కే కుప్పకూలింది. ప్రేరక్ (88), చిరాగ్ (64) పోరాడారు.