ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో దేశానికి క్రీడల్లో సేవలందించిన పలువురు క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దిన గురువులకు గౌరవం లభించింది. టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్‌కు పద్మభూషణ్ దక్కగా టీమ్ఇండియాకు క్రికెట్లో ప్రపంచకప్ ట్రోఫీలను అందించిన రోహిత్ శర్మ, హర్మన్‌ప్రీత్‌ను పద్మశ్రీ వరించింది. కేంద్రం ప్రకటించిన 131 పద్మ పురస్కారాలకు గాను క్రీడల్లో 9 మందికి ఈ ఏడాది పద్మ అవార్డులు దక్కాయి.
రోహిత్, హర్మన్‌ప్రీత్‌తో పాటు పారిస్ పారాలింపిక్స్ హైజంప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ప్రవీణ్ కుమార్ (ఉత్తరప్రదేశ్), భారత మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పునియా (హర్యానా) ఉన్నారు. కోచ్‌లలో మధ్యప్రదేశ్‌కు చెందిన భగవాన్‌దాస్ రైకర్ (మార్షల్ ఆర్ట్స్), వెటరన్ హాకీ కోచ్ బల్దేవ్ సింగ్ (పంజాబ్), సంప్రదాయ కర్రసాములో నిష్ణాతుడైన కె. పళనివేళ్ (పుదుచ్చేరి)కు పద్మశ్రీ వరించింది. జార్జియాకు చెందిన దివంగత రెజ్లింగ్ కోచ్ వ్లాదిమిర్ మెస్ట్విరిష్విలికి మరణానంతరం పద్మశ్రీ దక్కింది.

భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్ దేశ తొలి తరపు టెన్నిస్ ప్లేయర్. టెన్నిస్‌లో ఓపెన్ ఎరా మొదలయ్యాక ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ఆటగాళ్లలో ఆయన 18వ ర్యాంకుకు చేరుకున్నారు. ఇప్పటికీ ఈ రికార్డు చెక్కు చెదరలేదు. 1973, 1981 వింబుల్డన్ పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ చేరిన ఆయన.. యూఎస్ ఓపెన్ (1973, 1974)లోనూ రెండు సార్లు ఆ ఘనత సాధించారు.
1973 యూఎస్ ఓపెన్‌లో ఆయన ప్రఖ్యాత టెన్నిస్ క్రీడాకారుడు రాడ్ లీవర్ (ఆస్ట్రేలియా)ను మట్టికరిపించారు. ఇక డేవిస్ కప్‌లోనూ ఆయన భారత్‌ను రెండుసార్లు (1974, 1987) ఫైనల్ చేర్చారు. అమృత్‌రాజ్ సేవలకు గాను 2024లో అంతర్జాతీయ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఆయనకు చోటు దక్కింది. భారత క్రీడా రంగానికి ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 1974లో అర్జున అవార్డును అందివ్వగా 1983లో పద్మశ్రీతో సత్కరించింది. తాజాగా ఆయనకు దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మ భూషణ్ కూడా వరించడం విశేషం.