హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో అక్రమాలు జరిగాయంటూ విచారణ చేపటిన విజిలెన్స్ అధికారులు.. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్.. సర్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారించారు. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యజమాన్యాన్ని ఇబ్బంది పెట్టారని నివేదికలో పేర్కొన్నారు. అప్పటికే పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్న ఎస్ఆర్హెచ్ యాజమాన్యంపై మరో మరో 10 శాతం టికెట్లు కావాలని హెచ్ఏసీ ఒత్తిడి తెచ్చిందని సమాచారం. ఈ క్రమంలోనే లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ గ్యాలరీలకు హెచ్‌సీఏ సిబ్బంది తాళాలు వేశారని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫార్సు చేసిందని సమాచారం.