ఢిల్లీ : పాఠశాల విద్యార్థులకు ఫుట్‌బాల్ నేర్పిస్తున్న ఓ కోచ్‌ను బీజేపీ నాయకురాలు భయపెట్టిన వీడియో నెట్టింట వైరల్ అయింది. వివరాల్లోకెళ్తే.. ఢిల్లీలోని పట్పర్గంజ్ ప్రాంతంలోని మయూర్ విహార్ ప్రాంతంలో గల ఓ పార్క్‌లో చిన్నారులకు ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తి ఫుట్‌బాల్‌లో మెళకువలు నేర్పిస్తున్నాడు. అయితే అదే ఏరియాకు చెందిన రేణు చౌదరి పార్క్‌కు వెళ్లి.. ‘నువ్వు ఇక్కడికొచ్చి సంపాదిస్తున్నావంటే ఇక్కడి భాష (హిందీ)ను తప్పకుండా నేర్చుకోవాలి.
ఈ విషయం నీకు 8 నెలల కిందటే చెప్పా. పిల్లల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు నిన్ను ఏమీ అనడం లేదు’ అని తెలిపింది. అనంతరం పార్క్‌లో ఉన్న సిబ్బందితో ‘నెలరోజుల్లో హిందీ నేర్చుకోకుంటే అతడిని ఈ పార్క్ నుంచి గెంటేయండి’ అని ఆదేశించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె క్షమాపణలు చెబుతూ మరో వీడియో విడుదల చేసింది.