Virat Kohli | భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ భారత్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌కు ఢిల్లీకి వచ్చాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత విరాట్ భారత గడ్డపై అడుగుపెట్టారు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు టైటిల్ సాధించిన పెట్టిన తర్వాత జూన్‌లో లండన్‌కు వెళ్లిపోయాడు. భార్య అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలతో నాలుగు నెలల పాటు అక్కడే సమయం గడిపాడు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అభిమానులు కేరింతలు కొట్టారు. సెల్ఫీలు ఇవ్వాలని కోరగా.. విరాట్ తన కారులో ఎక్కి వెళ్లిపోయాడు. విరాట్ వచ్చే సమయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ సందర్భంగా విరాట్ కొత్త లుక్‌లో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాల వైరల్‌గా మారింది.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగునున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. 2024 టీ20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఇద్దరు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఇద్దరు వన్డేలు మాత్రమే ఆడనున్నారు. ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమిండియాను ఇప్పటికే ప్రకటించగా.. కెప్టెన్సీ నుంచి రోహిత్‌ను తప్పించి.. ఆ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు. వన్డే సిరీస్‌లో రోహిత్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. అయితే, 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, విరాట్ ఆడడం అనుమానంగానే ఉంది. రాబోయే రోజుల్లో భారత్ వన్డేలు తక్కువగానే ఆడనున్నది.
ఇదిలా ఉండగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ అక్టోబర్ 19న పెర్త్‌లో జరుగనున్నది. భారత జట్టు ఈ నెల 15న రెండు బ్యాచ్‌లుగా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్తుంది. బీసీసీఐ వర్గాలు తెలిపిన వివరాల ప్రాకరం.. మొదటి బృందంలో ఆటగాళ్లు ఉదయం విమానంలో బయలుదేరి వెళ్తారు. రెండో బృందం సాయంత్రం వెళ్తుంది. బిజినెస్ క్లాస్ టిక్కెట్ల లభ్యత, ప్రయాణ ఏర్పాట్లపై ఆధారపడి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చాలా రోజుల తర్వాత కోహ్లీ భారత జట్టు తరఫున మైదానంలోకి బరిలోకి దిగుతుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ‘వెల్కమ్ బ్యాక్ కింగ్’ అంటూ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది.
Virat Kohli clicked at Delhi Airport Today. #ViratKohli pic.twitter.com/t9nvNpsCcC
— Saurabh! (@Viratfiedguyy) October 14, 2025