సిడ్నీ : పాకిస్థాన్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు వెటరన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తొలి టెస్టుకు జట్టులో ఎంపిక చేశారు. పాక్‌తో జరిగే సిరీస్‌తో వార్నర్ టెస్టులకు వీడ్కోలు చెప్పనున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్లో కొనసాగుతానని తెలిపాడు.
సిడ్నీలో జరిగే మూడో టెస్టులో వార్నర్‌కు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు. పాట్ కమిన్స్ నేతృత్వంలో 14మంది సభ్యుల జట్టును ఆదివారం ప్రకటించారు. తొలి టెస్టు ఈనెల 14నుంచి పెర్త్‌లో, రెండో టెస్టు 26నుంచి మెల్బోర్న్లో, మూడో టెస్టు జనవరి 3నుంచి సిడ్నీలో జరుగనున్నాయి. సిరీస్‌కు ముందు పాకిస్థాన్ ప్రైమ్ మినిస్టర్ లెవెన్‌తో నాలుగు రోజుల మ్యాచ్‌లో తలపడుతుంది.