దుబాయ్: 128 ఏండ్ల తర్వాత ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్న క్రికెట్ నిర్వహణలో మరో ముందడుగు పడింది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో ఆడనున్న ఈ మెగా ఈవెంట్లో మ్యాచ్‌ల నిర్వహణ కోసం ఐసీసీ వేదికను ఖరారు చేసింది. సౌత్ కాలిఫోర్నియాలోని పొమొనలో ఉన్న ఫేర్గ్రౌండ్స్ను క్రికెట్ మ్యాచ్‌ల కోసం వినియోగించనున్నట్టు ఐసీసీ తెలిపింది. లాస్ ఏంజెల్స్‌లో ఒలింపిక్స్ జరిగే ప్రధాన వేదికకు పొమొనొ నగరం 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాస్తవానికి ఇది క్రికెట్ స్టేడియం కాదు. ఏడాది పాటు ఇక్కడ కమర్షియల్ ఈవెంట్లు, కన్వెన్షన్లు, మోటార్ రేసింగ్ ఈవెంట్లు జరుగుతుంటాయి.