Dilip Vengsarkar : భారత జట్టుతో సిరీస్ అంటే చాలు ‘అయ్యో జస్ప్రీత్ బుమ్రా’ ఉన్నాడని ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతారు. అలాంటిది ఈ యార్కర్ కింగ్ తరచూ గాయాలపాలవ్వడంతో పాటు కొన్ని మ్యాచ్‌లే ఆడుతుండడం టీమిండియాను దెబ్బతీస్తోంది. ఈమధ్యే ముగిసిన అండర్సన్ -టెండూల్కర్ ట్రోఫీలో అదే జరిగింది. ప్రధాన పేసర్ అయిన బుమ్రా మూడు మ్యాచ్‌లే ఆడడంతో శుభ్‌మన్ గిల్ సేన సిరీస్ పంచుకోవాల్సి వచ్చిందని పలువురు మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వెటరన్ ప్లేయర్ దిలీప్ వెంగ్‌సర్కార్(Dilip Vengsarkar) సైతం ఇదే మాట అంటున్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో బుమ్రా మూడు మ్యాచ్‌లకే పరిమితం అయ్యాడు. దాంతో, బౌలింగ్ భారం సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్, ప్రసిధ్లపై పడింది. ఒకవేళ బుమ్రా అన్ని టెస్టులు ఆడిఉంటే సిరీస్ భారత్ సొంతమయ్యేదని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడుతున్నాడు. ‘బుమ్రా ఐపీఎల్లో ఎవర్గ్రీన్ బౌలర్. కానీ, ఐపీఎల్ ప్రదర్శనను ఎవరు గుర్తుపెట్టుకుంటారు. సిరాజ్‌నే చూడండి.. ఓవల్ టెస్టులో అతడి సింహ గర్జనను అభిమానులు కలకాలం యాది చేసుకుంటారు. అలానే.. బ్యాటింగ్‌లో కెప్టెన్ గిల్, రాహుల్, యశస్వీ, పంత్‌ల ఆట ఎప్పటికీ చిరస్మరణీయమే.
Do you agree with Dilip Vengsarkar? #JaspritBumrah #CricketTwitter pic.twitter.com/Okp16GEWKV
— InsideSport (@InsideSportIND) August 11, 2025
వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్‌గా గొప్ప ప్రదర్శన కనబరిచాడు. బుల్లెట్ బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాల్సిన బుమ్రా మాత్రం మూడు మ్యాచ్‌లకే పరిమితం అయ్యాడు. అతడు గనకు ఐదుకు ఐదు టెస్టులు ఆడిఉంటే సిరీస్ గిల్ సేన చేతికి చిక్కేది’ అని దిగ్గజ ఆటగాడు వెల్లడించాడు. అంతేకాదు తాను సెలెక్టర్ అయి ఉంటే మాత్రం ముంబై ఇండియన్స్ యాజమాన్యాన్ని ఒప్పించి బుమ్రాపై వర్క్ లోడ్ పడకుండా చూసేవాడినని వెంగ్‌సర్కార్ అన్నాడు.
🚨NEW. Dilip Vengsarkar said, “If i was the india chief selector, I would have convinced Mukesh Ambani and Jasprit Bumrah that it was important for Bumrah to miss the IPL’25 for the England test series, or play lesser numbers of matches in the IPL, I’m sure that they would have… pic.twitter.com/AMHIhzvbu2
— Cricket Daily (@DailyCriicket) August 11, 2025
‘నేను భారత చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉంటే బుమ్రాను కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడించేలా అంబానీని ఒప్పించేవాడిని. ఇంగ్లండ్ సిరీస్ ముందు జరిగిన 18వ సీజన్లో అతడిని ప్రధాన మ్యాచ్‌లకే పరిమితం చేసేలా చూసేవాడిని. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముంబై ఫ్రాంచైజీ కూడా సంతోషంగా అంగీకరించేది’ అని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో బుమ్రా.. మూడు టెస్టుల్లో 14 వికెట్లు పడగొట్టాడు. ఓవల్ టెస్టులో సంచలన స్పెల్‌తో జట్టుకు చరిత్రాత్మక విక్టరీ అందించిన సిరాజ్ మొత్తంగా 23 వికెట్లు కూల్చాడు.