Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కు గారాల కూతురు వామిక (Vamika) ‘ఫాదర్స్ డే’ శుభాకాంక్షలు తెలిపింది. ఆర్ట్ వర్క్ ద్వారా వామిక తండ్రి విరాట్‌పై తన ప్రేమను తెలియజేసింది. ఆ బొమ్మను అనుష్కా శర్మ(Anushka Sharma) ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. ఆ పోస్ట్‌కు ‘ఒకే వ్యక్తి పలు విషయాల్లో ఉత్తమంగా ఎలా ఉండగలడు. ఇది ఆశ్చర్యకరం. వీ లవ్ యూ విరాట్ కోహ్లీ’ అని ఆమె క్యాప్షన్ రాసింది.
వామికా గీసిన ఆ బొమ్మలో రెండు పాద ముద్రలు ఉన్నాయి. ఒకటి ఆమెది కాగా.. మరొకటి కోహ్లీది. అంతేకాదు దానిపై ‘హ్యాపీ ఫాదర్స్ డే’ అని రాసి ఉంది. ఈ స్పెషల్ పోస్ట్ చూసిన కోహ్లీ వామికా ఆర్ట్ వర్క్‌కు ఫిదా అవుతున్నారు.
ఒక షాంపూ యాడ్‌లో పరిచమైన కోహ్లీ, అనుష్కలు 2017లో పెండ్లి చేసుకున్నారు. వీళ్లకు 2021 జనవరిలో వామికా జన్మించింది. ఈ మధ్యే విరాట్ రెండోసారి తండ్రి అయ్యాడు. లండన్‌లో అనుష్క పండంటి మగపిల్లాడిని కన్నది. అతడికి అకాయ్(Akaay) అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.
ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్ అయిన విరాట్ టీ20 వరల్డ్ కప్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. అంతకు ముందే ఐపీఎల్ పదిహేడో సీజన్(IPL 2024)లో దంచి కొట్టిన రన్ మెషీన్ స్లో పిచ్‌లపై మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. టీమిండియా ఓపెనర్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma)తో ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న విరాట్ మూడు మ్యాచుల్లో 1, 4, 0 రన్స్ స్కోర్ చేశాడు. దాంతో, సూపర్ 8లో అతడి ఫామ్ భారత జట్టును ఆందోళన పరుస్తోంది. అందుకని ఓపెనర్‌గా యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)ను పంపి.. ఎప్పటిలానే కోహ్లీని మూడో స్థానంలో ఆడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.