Allu Arjun – Atlee | ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ సినిమాతో బన్నీ దేశవ్యాప్తంగా తిరుగులేని ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో ఇప్పుడు బన్నీ సినిమాలకు మాములు డిమాండ్ లేదు. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు అన్ని ఇండస్ట్రీలలో అల్లు అర్జున్ సినిమా వస్తుందంటే ఎక్కడలేని అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సీక్వెల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమా అనంతరం ‘జవాన్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ మూవీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్లు తెలుస్తుంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు టాక్ నడిచిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం దర్శకుడు అట్లీ ఏకంగా రూ.80 కోట్లు డిమాండ్ చేశాడని తెలుస్తుంది. దీంతో అంత మొత్తం ఇవ్వలేని మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది.