జైపూర్ : వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) .. ఐపీఎల్లో సెన్షేషన్ క్రియేట్ చేశాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ఈ రాజస్థాన్ ప్లేయర్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టేశాడు. 14 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసిన ఐపీఎల్ ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. బీహార్‌కు చెందిన ఈ చిచ్చరపిడుగు.. ఐపీఎల్ వేలంలోనే చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పిల్లోడిని సొంతం చేసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ జట్టు కోటి వెచ్చించింది. వైభవ్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు అతని పేరెంట్స్ చాలా కష్టపడ్డారు. చబ్బీ చబ్బీ బుగ్గలున్న ఈ కుర్రాడు ప్రస్తుతం 14 ఏళ్ల 32 రోజులు మాత్రమే ఉన్నాడు. అయితే గుజరాత్‌తో మ్యాచ్‌లో అతను 35 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. అతని వీర బాదుడుకు గుజరాత్ బౌలర్లు ముఖం తేలేశారు.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025
బీహార్‌లోని సమస్తిపుర్ ఇతని స్వస్థలం. అక్కడి నుంచి సూర్యవంశీ క్రికెట్ జర్నీ స్టార్ట్ అయ్యింది. టీ20 క్రికెట్‌కు కావాల్సిన ట్యాలెంట్ అతనిలో ఉంది. భారీ షాట్లు ఈజీగా ఆడేస్తున్నాడు ఈ చిన్నోడు. పవర్ఫుల్ సిక్సర్లను అలవోకగా బాదేస్తున్నాడు. పాట్నా క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వైభవ్ చాలా శ్రమించాడు. పదేళ్ల వయసు నుంచే అతను రోజుకు 600 బంతులు ఆడేవాడు. 16 నుంచి 17 ఏళ్ల వయసున్న బౌలర్లను నెట్స్‌లో ఎదుర్కొనేవాడు. తండ్రి సంజీవ్ సూర్యవంశీ కొడుకు కోసం ఎక్స్ట్రా టిఫిన్ బాక్సులు తెచ్చేవాడు. ప్రాక్టీస్ చేస్తున్న వారి కోసం 10 అదనపు టిఫిన్ బాక్సులు తెచ్చేవాడట.
𝙏𝙖𝙡𝙚𝙣𝙩 𝙢𝙚𝙚𝙩𝙨 𝙊𝙥𝙥𝙤𝙧𝙩𝙪𝙣𝙞𝙩𝙮 🤗
He announced his arrival to the big stage in grand fashion 💯
It’s time to hear from the 14-year old 𝗩𝗮𝗶𝗯𝗵𝗮𝘃 𝗦𝘂𝗿𝘆𝗮𝘃𝗮𝗻𝘀𝗵𝗶 ✨
Full Interview 🎥🔽 -By @mihirlee_58 | #TATAIPL | #RRvGT https://t.co/x6WWoPu3u5 pic.twitter.com/8lFXBm70U2
— IndianPremierLeague (@IPL) April 29, 2025
వైభవ్ క్రికెట్ ఆశల్ని తీర్చేందుకు తండ్రి ఏకంగా తన భూమిని అమ్మేశాడు. వ్యవసాయ భూమిని అమ్మి కొడుకు కోసం ఖర్చు చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో అతను కొట్టిన సెంచరీలో 11 సిక్సర్లు, ఏడు ఫోర్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు అతను మూడు మ్యాచ్‌లు ఆడాడు. అయితే టోర్నీలో ఎదుర్కొన్న ఫస్ట్ బంతికే అతను సిక్సర్ కొట్టాడు. భారీ షాట్లు ఈజీగా ఆడేస్తున్న వైభవ్.. 3 మ్యాచుల్లో 151 రన్స్ చేశాడు. బ్యాటింగ్ సగటు 75.50 కాగా, స్ట్రయిక్ రేట్ 222.05గా ఉంది.
𝗟𝗲𝗮𝘃𝗶𝗻𝗴 𝗮 𝗹𝗮𝘀𝘁𝗶𝗻𝗴 𝗶𝗺𝗽𝗿𝗲𝘀𝘀𝗶𝗼𝗻 🤩
Praise of the highest order for the sensational Vaibhav Suryavanshi 👏🩷#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/K1McsTVQU8
— IndianPremierLeague (@IPL) April 29, 2025
బీహార్ తరపున దేశవాళీ ఆడుతున్నాడు వైభవ్… మార్చి 27, 2011లో జన్మించాడు. 2024 జనవరి లో అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పుడు అతని వయసు 12 ఏళ్ల 284 రోజులు. ఆస్ట్రేలియాతో చెన్నైలో జరిగిన అండర్ 19 క్రికెట్ మ్యాచ్‌లో వైభవ్ కేవలం 58 బంతుల్లో సెంచరీ బాదాడు. అండర్19 ఆసియాకప్‌లో 5 మ్యాచుల్లో అతను 176 రన్స్ చేశాడు.