Vaibhav Suryavanshi | ఐపీఎల్-2025 మెగా వేలం ముగిసింది. అత్యంత పిన్నవయస్కుడైన వైభవ్ రఘువంశీ సైతం వేలానికి వచ్చాడు. క్రికెటర్ వయసు కేవలం 13 సంవత్సరాలే. వేలంలో రాజస్థాన్ రాయల్స్ రఘువంశిని కొనుగోలు చేసింది. అయితే, అతన్ని తీసుకోవడానికి కారణాలను రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించారు. రాబోయే సీజన్లో జట్టును విజయపథంలో నడిపించే వాతావరణం అందించగలదని పేర్కొన్నారు. బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాకు చెందిన సూర్యవంశీ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అతన్ని రాజస్థాన్ రాయల్స్ రూ.1.10కోట్లు కొనుగోలు చేసి తీసుకున్నది. ఐపీఎల్ విడుదల చేసిన వీడియోలో ద్రవిడ్ మాట్లాడుతూ.. రఘువంశీలో మంచి నైపుణ్యం ఉందని తాను భావిస్తున్నానన్నారు.
అతడు అభివృద్ధి చెందేందుకు మంచి వాతావరణాన్ని అందించగలమని భావిస్తున్నామన్నారు. ట్రయల్స్ కోసం వచ్చాడని.. అతన్ని చూడడం ఆనందంగా ఉందన్నారు. ట్రయల్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడన్నారు. ఇక వేలంలో సూర్యవంశీ రూ.30లక్షల బేస్ ప్రైస్‌తో వేలానికి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతని తీసుకునేందుకు ఆసక్తి చూపింది. ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ రూ.1.10కోట్ల తీసుకున్నది. సూర్యవంశీ ఇటీవల చెన్నైలో ఆస్ట్రేలియాతో అండర్-19తో జట్టు టెస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన రెండో అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సూర్యవంశీ 62 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. రాజస్థాన్‌తో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరఫున టీ20లో అరంగేట్రం చేసిన సూర్యశంశీ ఆరు బంతుల్లో 13 పరుగులు చేశాడు.
సూర్యవంశీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పెద్దగా ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఐదు మ్యాచ్‌ల్లో 10 సగటుతో కొద్ది పరుగులే చేశాడు. బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన సూర్యవంశీ 2023-24 రంజీ ట్రోఫీ సీజన్లో ముంబయి మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 12 సంవత్సరాల 284 రోజులకే అరంగేట్రం చేసి టోర్నమెంట్ చరిత్రలో అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. 12 ఏళ్ల వయసులోనే బిహార్ తరఫున వినూ మన్కడ్ ట్రోఫీలో పాల్గొన్నాడు. ఐదు మ్యాచుల్లో 400 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ వేలంలో బౌలర్లపై దృష్టి సారించినట్లు ద్రవిడ్ తెలిపారు. ఫాస్ట్ బౌలర్లు ఆకాశ్ మధ్వల్, జోఫ్రా ఆర్చర్, తుషార్ దేశ్‌పాండే, ఫజల్హాక్ ఫరూకీ, అశోక్ శర్మ, క్వీనా మ్ఫాకాలను రాయల్స్ కొనుగోలు చేసింది. స్పిన్నర్లలో మహిష్ తీక్షణ, కార్తికేయ సింగ్‌లను తీసుకుంది. కీలక బ్యాట్స్మెన్లలో చాలా మందిని రిటైన్ చేసుకున్నామని.. ఈ సారి వేలంలో బౌలర్లపై దృష్టి పెట్టినట్లు వివరించారు.