హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): చిన్న పిల్లాడే అయినా క్రికెట్లో చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడని యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. 14 ఏండ్ల వయస్సులోనే క్రికెట్లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడని ప్రత్యేకంగా అభినందించారు.
కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడని, ఎలాంటి భయం లేకుండా ఆడుతున్న అతడి అద్భుత ప్రతిభకు ముచ్చటేస్తున్నదని తెలిపారు. మొదటి ఐపీఎల్‌లోనే వైభవ్ ఇంత మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తే.. మున్ముందు అతడి బ్యాటు నుంచి ఇలాంటి సెంచరీలు చాలా చూడవచ్చని పేర్కొన్నారు. అభినందనలు యంగ్‌మ్యాన్.. అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ప్రశంసించారు.