కోల్‌కతా : బరిలోకి దిగితే రికార్డుల దుమ్ముదులపడమే పనిగా పెట్టుకున్న ఐపీఎల్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు ఇటీవల ముగిసిన ఆసియా రైజింగ్ స్టార్స్‌లోనూ సెంచరీలు చేసిన 14 ఏండ్ల ఈ బీహార్ బాలుడు.. తాజాగా సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లోనూ శతకం బాదాడు.
తద్వారా భారత్ తరఫున ఈ ఫార్మాట్లో అతి పిన్న వయసులోనే అత్యధిక సెంచరీలు (3) చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. స్మాట్‌లో సొంత రాష్ట్రం బీహార్‌కు ఆడుతున్న అతడు(108*).. మంగళవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 58 బంతుల్లో మూడంకెల స్కోరును అందుకున్నాడు. ఈ రికార్డుతో పాటు టీ20ల్లో 16 ఇన్నింగ్స్‌ల్లోనే 3 సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా భారత్ నుంచి మొదటి ఆటగాడిగానూ అరుదైన ఘనతను అందుకున్నాడు.