ఢిల్లీ: ఈనెల 14 నుంచి 23 మధ్య దోహా (ఖతార్) వేదికగా జరగాల్సి ఉన్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ టోర్నీ కోసం ప్రకటించిన భారత జట్టులో ఐపీఎల్ సంచలన ఆటగాళ్లు వైభవ్ సూర్యవంశీ, ప్రియాన్ష్ ఆర్యకు చోటు దక్కింది. భారత వికెట్ కీపర్ జితేశ్ శర్మ సారథ్యంలోని ఈ జట్టులో ఐపీఎల్ స్టార్లు నెహల్ వధేర, నమన్ ధీర్, అశుతోష్ శర్మ, అభిషేక్ పొరెల్ వంటి యువ ఆటగాళ్లున్నారు.
గ్రూప్ బీలో ఒమన్, యూఏఈ, పాకిస్థాన్‌తో ఉన్న భారత జట్టు.. నవంబర్ 14న యూఏఈతో తొలిమ్యాచ్ ఆడనుంది.