షార్జా: ఆసియాకప్‌లో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో ఇండియా-19 జట్టు 10 వికెట్ల తేడాతో యూఏఈ జట్టుపై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు.. 44 ఓవర్లలో 137 రన్స్‌కు ఆలౌటైంది. రాయన్ అత్యధికంగా 35 రన్స్ చేశాడు. యుదజిత్ గుహ 3 వికెట్లు తీసుకోగా, చేతన్ శర్మ.. హార్దిక్ రాజ్‌లు చెరి రెండు వికెట్లు తీసుకున్నారు. 138 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా జట్టు.. సునాయాసంగా విజయాన్ని అందుకున్నది. 1601 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 143 రన్స్ చేసి 10 వికెట్ల తేడాతో భారత్ విక్టరీ కొట్టింది. వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) 76, ఆయుష్ మాత్రే 67 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచారు. వైభవ్ ఇన్నింగ్స్‌లో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. కోటి రూపాయలు పెట్టి వైభవ్‌ను ఐపీఎల్లో రాజస్థాన్ జట్టు కొన్న విషయం తెలిసిందే.
1️⃣3️⃣-year old on a rampage 😎
Vaibhav Suryavanshi is setting the field on 🔥 at Sharjah in #UAEvIND 💪
Cheer for #TeamIndia in the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV 📲 pic.twitter.com/HSz8aiTUiW
— Sony LIV (@SonyLIV) December 4, 2024