ICC : పురుషుల అండర్ -19 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారీ శతకంతో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి.. భారత జట్టు ఆరోసారి విజేతగా నిలవడంతో కీలకమైన వైభవ్ టోర్నమెంట్ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ మెగా ఈవెంట్లో గొప్పగా రాణించిన టీమిండియా కుర్రాళ్లు కనిష్క్ చౌహన్, పేసర్ హెనిల్ పటేల్ ప్రపంచకప్ జట్టులో చోటు సంపాదించారు. రన్నరప్ ఇంగ్లండ్ టీమ్ నుంచి ముగ్గురిని పదకొండు మంది బృందంలోకి తీసుకున్నారు.
ఐసీసీ నిర్వహించే ప్రతి వరల్డ్‌కప్ ముగిశాక తుది జట్టును ప్రకటించడం ఆనవాయితీ. ఈసారి పురుషుల అండర్ -19 ప్రపంచకప్ ముగియడమే ఆలస్యం సంచలన ప్రతిభతో ఆకట్టుకున్న 11 మందితో జట్టును ప్రకటించారు. క్రికెట్ దిగ్గజాలు ఇయాన్ బిషప్, లిడియా గ్రీన్వే, ఆండీ ఫ్లవర్, టెల్ఫోర్డ్ వైసేలతో కూడిన సెలెక్టర్ల బృందం ఆదివారం టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను వెల్లడించింది. ఇందులో భారత్ నుంచి వైభ్వ్తో పాటు కనిష్క్ చౌహన్, పేసర్ హెనిల్ పటేల్‌కు చోటు దక్కింది. ఇంగ్లండ్ కెప్టెన్ థామస్ రే వరల్డ్‌కప్ జట్టుకు సారథిగా ఎంపికయ్యాడు. అఫ్గనిస్థాన్ నుంచి ఇద్దరు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, పాకిస్థాన్ ఒక్కరు ఈ టీమ్‌లోకి ఎంపికయ్యారు.
🚨 ICC U19 World Cup Team of the Tournament 🚨
🇮🇳 Vaibhav Sooryavanshi
🇱🇰 Viran Chamuditha
🇦🇫 Faisal Khan Shinozada
🏴 Thomas Rew (c, wk)
🇦🇺 Oliver Peake
🏴 Ben Mayes
🇮🇳 Kanishk Chouhan
🇦🇫 Nooristani Omarzai
🏝️ Vitel Lawes
🇵🇰 Ali Raza
🏴 Manny Lumsden
🇮🇳 Henil Patel (12th MAN)… pic.twitter.com/AWNOh1zGMC— CricketGully (@thecricketgully) February 8, 2026
అండర్ -19 ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ : వైభవ్ సూర్యవంశీ, కనిష్క్ చౌహన్, హెనిల్ పటేల్(భారత్), థామస్ రే(కెప్టెన్, ఇంగ్లండ్), ఒలివర్ పీకే(ఆస్ట్రేలియా), బేన్ మయెస్(ఇంగ్లండ్), నూరిస్తాని ఒమర్జాయ్(అఫ్గనిస్థాన్), విరన్ చముదిత(శ్రీలంక), ఫైజల్ ఖాన్ శిన్వారీ (అఫ్గనిస్థాన్), విటెల్ లవెస్(వెస్టిండీస్), మన్నీ లుమ్స్డెన్(ఇంగ్లండ్), అలీ రజా(పాకిస్థాన్).
జింబాబ్వే వేదికగా జరిగిన పురుషుల అండర్ -19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ(175) పిడుగల్లే విరుచుకుపడగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే(53), అభిగ్యాన్ కుందు(40)లు చెలరేగారు. ఆఖర్లో కనిష్క్ చౌహన్(37 నాటౌట్) మెరుపులతో 411 రన్స్ కొట్టిన టీమిండియా.. అనంతరం ప్రత్యర్ధిని 311కే కట్టడి చేసింది. అంబ్రిష్(3-56), కనిష్క్(2-63), దీపేశ్(2-64) అద్బుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ ఆశలపై నీళ్లు చల్లారు. వంద పరుగుల తేడాతో నెగ్గిన భారత్.. రికార్డు స్థాయిలో ఆరోసారి ట్రోఫీని అందుకుంది.