RR vs LSG | వైభవ్ ఊచకోతకు బలైన లక్నో.. పంజాబ్‌ను కిందకు నెట్టేసిన రాజస్థాన్..!
RR vs LSG : చావోరేవో పోరులో వైభవ్ సూర్యవంశీ(93) ఊచకోతకు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు బలయ్యారు. వైభవ్ విధ్వంసంతో ప్లే ఆఫ్స్ చివరి బెర్తుపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్‌కు కీలకమైన రెండు పాయింట్లు వచ్చాయి.
RR vs LSG : చావోరేవో పోరులో వైభవ్ సూర్యవంశీ(93) ఊచకోతకు లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లు బలయ్యారు. వైభవ్ విధ్వంసంతో ప్లే ఆఫ్స్ చివరి బెర్తుపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్‌కు కీలకమైన రెండు పాయింట్లు వచ్చాయి. జైపూర్‌లో లక్నో బౌలర్లపై తుఫాన్‌లా విరుచుకుపడిన వైభవ్.. భారీ అర్ధ శతకంతో లక్ష్యాన్ని మంచుముక్కలా కరిగించాడు. యశస్వీ(43) కెప్టెన్ ఇన్నింగ్స్‌కు, జురెల్(53 నాటౌట్) మెరుపులు తోడవ్వగా రాజస్థాన్ అదిరే విజయంతో పంజాబ్ కింగ్స్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకింది.
ప్లే ఆఫ్స్‌లో నిలవాలంటే గెలవ తప్పని మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పంజా విసిరింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తేరుకుంటూ అదిరే విజయంతో నాకౌట్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. లక్నో నిర్దేశించిన 221 పరుగుల భారీ ఛేదనలోఆశ్చర్యంగా వైభవ్ సూర్యవంశీ(93 38 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్సర్లు) బదులు ఓపెనర్ యశస్వీ జైస్వాల్(43) చితక్కొట్టాడు. తొలి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు.. ఆపై మొహ్సిన్ ఓవర్లో సిక్స్, మూడు ఫోర్లతో 19 పరుగులు పిండుకున్నాడు. మొదట్లో టైమింగ్ కుదరక నెమ్మదించిన వైభవ్ పవర్ ప్లే ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు, సిక్సర్ బాదగా రాజస్థాన్ అజేయంగా 71 పరుగులు చేసింది. చెలరేగుతున్న యశస్వీని ఔట్ చేసి ఈ జోడీని ఆకాశ్ విడదీశాడు.
Vaibhav at SMS is just different gravy 🔥 pic.twitter.com/FBSGQJMm61
— Rajasthan Royals (@rajasthanroyals) May 19, 2026
92 పరుగుల వద్ద
లక్నోకు తొలి వికెట్ అందించిన ఆకాశ్‌కు చుక్కలు చూపిస్తూ.. 6, 4, 4, 6, 4 తో 26 రన్స్ రాబట్టి 23 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు వైభవ్. ఆ తర్వాత మరింత ఉతికేసిన చిచ్చరపిడుగు ధ్రువ్ జురెల్(53 నాటౌట్)తో కలిసి లక్ష్యాన్ని కరిగించాడు. 92 పరుగుల వద్ద మొహ్సిన్ పొరపాటుతో రనౌట్ తప్పించుకున్నాడు. కానీ, అదే ఓవర్లో సమద్ చేతికి చిక్కాడు. అప్పటికే రాజస్థాన్ విజయానికి చేరువవ్వగా జురెల్, ఫెరీరా(16 నాటౌట్)లు లాంఛనం పూర్తి చేశారు. ఫెరీరా సిక్సర్‌తో 7 వికెట్ల తేడాతో గెలుపొందిన రాజస్థాన్ ప్లే ఆఫ్స్ పోటీలో నిలిచింది.
#VaibhavSooryavanshi Special! 🩷
A fifty in just 23 balls – his 2nd slowest in the TATA IPL. Talk about talent! 😅
Will he take #RR over the line tonight? 🤔#TATAIPL Race to Playoffs 2026 👉 #RRvLSG | LIVE NOW ➡️https://t.co/xzGfDZk1n6 pic.twitter.com/pxvkYnJiDF
— Star Sports (@StarSportsIndia) May 19, 2026
మార్ష్, ఇంగ్లిస్ విధ్వంసం
టాస్ ఓడిన లక్నోకు ఓపెనర్లు మిచెల్ మార్ష్(96), జోష్ ఇంగ్లిస్(60)లు మెరుపు ఆరంభాన్నిచ్చారు. జైపూర్ మైదానంలో ప్రేక్షకులను అలరిస్తూ రాజస్థాన్ బౌలర్లను బెంబేలెత్తిస్తూ ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదారు. దాంతో, పవర్ ప్లలోనే స్కోర్ 80 దాటింది. పిడుగుల్లే విరుచుకుపడిన ఇంగ్లిస్‌ను బౌల్డ్ చేసిన యశ్ రాజ్ ఎట్టకేలకు ఈ జోడీని విడదీసి రాజస్థాన్‌కు ఉపశనమనమిచ్చాడు.

ఇంగ్లిస్ ఔటైనా మార్ష్ జోరు తగ్గించలేదు. రాజస్థాన్ పేలవ ఫీల్డింగ్ కూడా కలిసి రావడంతో.. పూరన్(16), కెప్టెన్ రిషభ్ పంత్(35)లతో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన మార్ష్ స్కోర్ రెండొందలు దాటించాడు. కానీ, ఆర్చర్ వేసిన ఆఖరి ఓవర్లో మార్ష్, పంత్ రనౌటవ్వగా.. అయుశ్ బదొని(0) బౌల్డయ్యాడు. టపటపా మూడు వికెట్లు పడడంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

