Vaibhav Suryavanshi : ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో మెరుపు సెంచరీతో వార్తల్లో నిలిచిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) టీ20ల్లో తన విధ్వంసాన్ని కొనసాగుతున్నాడు. ఇటీవలే రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ (Asia Cup Rising Stars) టోర్నీలో యూఏఈపై 32 బంతుల్లోనే సెంచరీతో గర్జించిన వైభమ్ మళ్లీ శతక్కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (Syed Mushtaq Ali Trophy)లో మెరుపు బ్యాటింగ్‌తో మహారాష్ట్ర బౌలర్లను వణికించిన ఈ చిచ్చరపిడుగు 61 బంతుల్లో 108 పరుగులతో మెరిశాడు.
భారత క్రికెట్లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ పొట్టి క్రికెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. అండర్ -19 విభాగంలో దంచేస్తున్న ఈ యంగ్‌స్టర్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ మెరుపులు మెరిపించాడు. బిహార్ తరఫున ఆడుతున్న వైభవ్ ఈడెన్ గార్డెన్స్‌లో మంగళవారం మహారాష్ట్ర బౌలర్లకు దడ పుట్టిస్తూ కేవలం 57 బంతుల్లోనే శతకం సాధించాడు. 61 బంతులు ఎదుర్కొన్న ఈ యువకెరటం ఏడు సిక్సర్లు.. అన్నేసి ఫోర్లతో 108 పరుగులతో విరుచుకుపడ్డాడు. అతడి విధ్వంసంతో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది బిహార్. అయితే.. భారీ లక్ష్యాన్ని కెప్టెన్ పృథ్వీ షా(30 బంతుల్లో 66 రన్స్) మెరుపు అర్ధ శతకంతో మహారాష్ట్ర అలవకోగా ఛేదించింది.
🚨 Record Alert 🚨
Another feather in the cap for Vaibhav Sooryavanshi who becomes the youngest batter to score a century in #SMAT at the age of 14 years and 250 days 🫡
He achieved the feat with a scintillating 1⃣0⃣8⃣*(61) for Bihar against Maharashtra in Kolkata👏
Scorecard… pic.twitter.com/UFGqPg1vmm
— BCCI Domestic (@BCCIdomestic) December 2, 2025
రైజింగ్ ఆసియా కప్‌లో ఆకాశమే హద్దుగా ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ యూఏఈపై 10 ఫోర్లు, 9 సిక్సర్లతో మూడంకెల స్కోర్ అందుకున్నాడు. 32 బంతుల్లోనే వంద కొట్టిన వైభవ్.. పురుషుల టీ20ల్లో భారత్ తరఫున మూడో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. దొరికిన బంతినల్లా బౌండరీకి పంపిన ఈ చిచ్చరపిడుగు.. వెస్టిండీస్ వెటరన్ క్రిస్ గేల్ అత్యధిక స్కోర్‌ను అధిగమించేలా కనిపించాడు. కానీ, వైభవ్ 144 వద్ద ఔట్ కావడంతో గిల్ రికార్డు అలానే ఉండిపోయింది.
Hundred for Rajasthan Royals ✅
Hundred for India A ✅
Hundred for Bihar ✅14-year-old Vaibhav Suryavanshi has scored 3 hundreds in T20s from just 16 innings. 🤯#Cricket #SMAT #BCCI pic.twitter.com/Thr380OPzv
— Sportskeeda (@Sportskeeda) December 2, 2025
ఐపీఎల్ 18వ సీజన్ నుంచి వైభవ్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఓపెనర్‌గా అదరకబెదరక సిక్సర్ల వాన కురిపించే అతడు క్రీజులో ఉన్నాడంటే బౌలర్లు జడుస్తున్నారు. పన్నెండేళ్లకే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభవ్‌ను ఆ ఎడిషన్ మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్లకు రాజస్థాన్ శిబిరంలో చేరిన ఈ కుర్రాడు తన బ్యాటింగ్‌ను సానబెట్టుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంసన్ గాయపడడంతో లక్నోతో మ్యాచ్‌లో వైభవ్‌కు ఓపెనర్‌గా అవకాశం వచ్చింది. తొలి మ్యాచ్‌లోనే 35 పరుగులతో ఆకట్టుకున్న ఈ చిచ్చరపిడుగు.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్‌పై సెంచరీతో గర్జించాడు.
Youngest to score a T20 1⃣0⃣0⃣ ✅
Fastest TATA IPL hundred by an Indian ✅
Second-fastest hundred in TATA IPL ✅Vaibhav Suryavanshi, TAKE. A. BOW 🙇 ✨
Updates ▶ https://t.co/HvqSuGgTlN#TATAIPL | #RRvGT | @rajasthanroyals pic.twitter.com/sn4HjurqR6
— IndianPremierLeague (@IPL) April 28, 2025
సిరాజ్, రషీద్ ఖాన్ వంటి మేటి బౌలర్లను అలవోకగా ఆడేసిన వైభవ్ .. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకే అన్నట్టు చెలరేగిన వైభవ్.. 35 బంతుల్లోనే వందతో జైపూర్ ప్రేక్షకులకు సెల్యూట్ చేశాడు. అతడి విధ్వంసక ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్సర్లు ఉండడం విశేషం. ఐపీఎల్ స్టార్‌గా భారత అండర్-19 జట్టులోకి వచ్చిన వైభవ్ ఇంగ్లండ్ పర్యటనలో.. ఆపై ఆస్ట్రేలియా గడ్డపై చితక్కొట్టాడు. ఆసీస్‌తో జరిగిన యూత్ వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీ బాదిన వైభవ్.. అత్యధిక సిక్సర్లతో మరో ఫీట్ సాధించాడు. మాజీ టీమిండియా ప్లేయర్ ఉన్ముక్త్ చంద్ (Unmukt Chand) పేరిట ఉన్న రికార్డును తన పేరిట రాసుకున్నాడీ చిచ్చరపిడుగు.