IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రికార్డుల పరంపర కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ హిస్టరీలోనే రెండో వేగవంతమైన శతకం బాదేశాడు. బౌలర్ మారినా బంతి గమ్యం స్టాండ్స్‌లోకే అన్నట్టు చెలరేగిన వైభవ్.. 35 బంతుల్లోనే వందంతో జైపూర్ ప్రేక్షకులకు సెల్యూట్ చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ అయితే చక్రాల కుర్చీలోంచి లేచి సంబురాలు చేసుకున్నాడు.
భారీ ఛేదనలో రాజస్థాన్‌కు శుభారంభం ఇచ్చిన వైభవ్.. 17 బంతుల్లోనే అర్ధ శతకం బాదేశాడు. ఈ లీగ్‌లో తొలి ఫిఫ్టీతో అలరించిన అతడు.. ఆ తర్వాతి 18 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తన మొదటి ఐపీఎల్ ఫిఫ్టీనే శతకంగా మలిచాడు వైభవ్. అతడి విధ్వంసక సెంచరీలో 7 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి.
Vaibhav Suryavanshi breaks Riyan Parag’s record by OVER THREE YEARS 🤯 pic.twitter.com/0MpWTWRTDr
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2025
ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీ బాదిన వాళ్లలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్న రోజుల్లో గేల్ 30 బంతుల్లోనే శతకగర్జన చేశాడు. 35 బంతుల్లోనే వంద కొట్టేసిన వైభవ్ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. యూసుఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్లు కూడా ఫాస్టెస్ట్ సెంచరీ వీరుల జాబితాలో ఉన్నారు.
— ESPNcricinfo (@ESPNcricinfo) April 28, 2025
క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 30 బంతుల్లో -2013
వైభవ్ సూర్యవంశీ(రాజస్థాన్) – 35 బంతుల్లో – 2025
యూసుఫ్ పఠాన్ (రాజస్థాన్) – 37 బంతుల్లో – 2010
డేవిడ్ మిల్లర్ (పంజాబ్ కింగ్స్) – 38 బంతుల్లో – 2013