అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) ఆరో సీజన్లో యూ ముంబా జట్టు విజేతగా నిలిచింది. గత మూడు వారాలుగా క్రీడాభిమానులను అలరించిన ఈ టోర్నీ ఫైనల్లో యూ ముంబా జట్టు.. 8-4తో జైపూర్ పాట్రియాట్స్‌పై ఘనవిజయం సాధించి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. అహ్మదాబాద్‌లోని ఎకా ఎరీనా వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్‌లో యూ ముంబా ఆటగాడు లిలియన్ బార్డెట్ 2-1 (4-11, 11-5, 11-7)తో కనక్ ఝాను ఓడించగా మహిళల సింగిల్స్‌లో బెర్నడెట్.. 2-1 (11-9, 10-11, 11-5)తో ఆకుల శ్రీజపై గెలిచింది.
మిక్స్డ్ డబుల్స్‌లో ముంబై ద్వయం ఆకాశ్, బెర్నడెట్.. 3-0 (11-6చ 11-5, 11-5)తో జీత్ చంద్ర, బ్రిట్ ఎర్లండ్ను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో అభినానంద్ 1-2 (5-11, 8-11, 11-8)తో జీత్ చంద్ర చేతిలో ఓడాడు. యూటీటీలో ముంబై జట్టుకు ఇదే తొలి ట్రోఫీ కావడం విశేషం.