ఢిల్లీ: జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి 28 వరకు బోల్ట్ భారత్లోని ఢిల్లీ, ముంబైలో పర్యటించనున్నాడు.
ఓ ప్రమోషనల్ ఈవెంట్ కోసం తాను భారత్కు వస్తున్నానని స్వయంగా అతడే ‘ఎక్స్’ ద్వారా వెల్లడించాడు. బోల్ట్ భారత పర్యటనకు రావడం ఇది రెండోసారి. 2014లో అతడు.. యువరాజ్ సింగ్తో కలిసి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఇక్కడికి వచ్చాడు.