T20 World Cup 2024 : పొట్టి ప్రపంచకప్‌లో ఆతిథ్య అమెరికా(USA) జట్టు చరిత్రను తిరగరాసింది. సొంతగడ్డపై సంచలన విజయాలతో క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిన యూఎస్ఏ జట్టు.. సూపర్ 8లో అడుగుపెట్టి రికార్డు సృష్టించింది. ఫ్లోరిడాలో వాన కారణంగా ఐర్లాండ్(Ireland)తో మ్యాచ్ రద్దు కావడంతో మొనాక్ పటేల్ (Monak Patel) బృందం దర్జాగా రెండో రౌండ్‌కు చేరింది.
అంతేకాదు ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. రెండేండ్ల తర్వాత జరుగబోయే టీ20 వరల్డ్ కప్ 2026 పోటీలకు సైతం యూఎస్ఏ అర్హత సాధించింది. అవును.. భారత్ (India), శ్రీలంక (Srilanka)లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో అమెరికా ఆడనుంది. తొమ్మిదో సీజన్లో సూపర్ 8కు క్వాలిఫై అయిన ఎనిమిది జట్లకు నేరుగా బెర్తు దక్కనుంది. 20 జట్లు పాల్గొనే ఈ మోగా టోర్నీలో.. మిగతా 12 బెర్తులు వరల్డ్ కప్ క్వాలిఫయర్ పోటీల ద్వారా ఖరారు కానున్నాయి.
HISTORY IN THE MAKING!!! 🇺🇸🔥🙌
For the first time ever, #TeamUSA have qualified for the Super 8 stage of the @ICC @T20WorldCup! 🤩✨
Congratulations, #TeamUSA! 🙌❤️ pic.twitter.com/tkquQhAVap
— USA Cricket (@usacricket) June 14, 2024
ఇంతకుముందు ఆటల్లో అమెరికా అంటే ఒలిపింక్స్ మెడల్స్ బాస్కెట్ బాల్, బేస్‌బాల్, ఫుట్‌బాల్ రగ్బీ వంటివే గుర్తుకొచ్చేవి. కానీ, ఇప్పుడు అమెరికా క్రికెట్లో సంచలనాలకు కేంద్రమైంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన, వాళ్ల పోరాట పటిమ అందర్నీ అబ్బురపరిచింది. ముఖ్యంగా అండర్ 19లో భారత్‌కు ఆడిన సౌరభ్ నేత్రావల్కర్(Saurabh Netravalkar) అమెరికా గెలుపు గుర్రంగా పేరొందాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన సౌరభ్ ఒరాకిల్ కంపెనీలో జాబ్ చేస్తూనే బౌలర్‌గా ఎదిగాడు.
పాకిస్థాన్‌పై 8 పరుగులకే రెండు వికెట్లు తీసిన ఈ స్పీడ్‌స్టర్.. భారత్‌పైనా తన ప్రతాపం చూపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే విరాట్ కోహ్లీని.. ఆ తర్వాత రోహిత్ శర్మను ఔట్ చేసి ప్రపంచ స్థాయి బౌలర్ అనిపించుకున్నాడు. దాంతో, 111 పరుగుల ఛేదనలో టీమిండియా టాపార్డర్‌ను కుప్పకూల్చాడు.
Sourabh Netravalkar is a full-time Engineer and a part-time cricketer who yesterday dismissed one of the all time great Virat Kohli.
What a story! #IndVsUSA pic.twitter.com/gPqgMY0rLV
— Haroon 🍉 (@harooonaldo) June 13, 2024
అయితే.. స్టాప్ క్లాక్ (Stop Clock) రూల్స్ ప్రకారం అమెరికాకు ఐదు పరుగుల పెనాల్టీ విధించడం ఆ జట్టు అవకాశాల్ని దెబ్బతీసింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీతో చెలరేగగా.. శివం దూబే సమయోచిత ఇన్నింగ్స్‌తో ఓటమిని తప్పించారు.
2️⃣ more points in the 💼 🥳 #TeamIndia seal their third win on the bounce in the #T20WorldCup & qualify for the Super Eights! 👏 👏
Scorecard ▶️ https://t.co/HTV9sVyS9Y#USAvIND pic.twitter.com/pPDcb3nPmN
— BCCI (@BCCI) June 12, 2024