USA vs BAN | పొట్టి క్రికెట్లో సంచలనం.. బంగ్లాకు షాకిచ్చిన అమెరికా
USA vs BAN : సంచలనాలకు కేరాఫ్ అయిన పొట్టి క్రికెట్లో పసికూన అమెరికా(USA) జట్టు చరిత్ర సృష్టించింది. తొలి టీ20 సిరీస్ (T20 Series) గెలుపొందింది. బంగ్లాదేశ్ (Bangladesh)పై సిరీస్ విజయంతో పొట్టి ప్రపంచ కప్ ముందు కొండంత ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకుంది.
USA vs BAN : సంచలనాలకు కేరాఫ్ అయిన పొట్టి క్రికెట్లో పసికూన అమెరికా(USA) జట్టు చరిత్ర సృష్టించింది. తొలి టీ20 సిరీస్ (T20 Series) గెలుపొందింది. అలాగని ఏదో అనామక జట్టుపై గెలిచిందనుకుంటే పొరపడ్డట్టే. అవును.. అంతర్జాతీయ క్రికెట్లో మేటి జట్లలో ఒకటైన బంగ్లాదేశ్ (Bangladesh)పై సిరీస్ విజయంతో పొట్టి ప్రపంచ కప్ ముందు కొండంత ఆత్మవిశ్వాసాన్ని పోగేసుకుంది.
సొంతగడ్డపై జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో అమెరికా అద్భుత విజయంతో ఆశ్చర్యపరిచింది. ఆ విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ హౌస్టన్ వేదికగా బంగ్లాదేశ్‌ను మరోసారి చిత్తుగా ఓడించి టీ20 సిరీస్ కైవసం చేసుకుంది.
Back-to-back performances today by our batting lineup that clinched the T20i Series against Bangladesh! 🔥💪#USAvBAN 🇺🇸 pic.twitter.com/oloXXJue1u
— USA Cricket (@usacricket) May 23, 2024
మొనాక్, అలీ విజృంభించగా
మే 23న హౌస్టన్‌లో జరిగిన రెండో టీ20లో మొదట ఆడిన అమెరికా 6 వికెట్ల నష్టానికి 144 రన్స్ కొట్టింది. వికెట్ కీపర్, కెప్టెన్ మొనాక్ పటేల్(42), అరొన్ జోన్స్(35) మెరుపులతో ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం స్వల్ప ఛేదనలో అలీ ఖాన్ మూడు వికెట్లతో చెలరేగాడు. సౌరభ్ నేత్రావల్కర్, షాడ్లేలు రెండేసి వికెట్లతో విజృంభించగా బంగ్లాదేశ్ 138కే ఆలౌట్ అయింది. దాంతో, మరో మ్యాచ్ ఉండగానే అమెరికా జట్టు పొట్టి సిరీస్ సొంతం చేసుకుంది.
USA WIN THE SERIES 2-0! WHAT A HISTORIC MOMENT! 🇺🇸🔥
Stay tuned for the final match of the series on May 25th! 🏏#USAvBAN pic.twitter.com/CuRACXwd21
— USA Cricket (@usacricket) May 23, 2024
ఇవి కూడా చదవండి
- Faria Abdullah | క్యూట్ లుక్స్‌తో ఫరియా అబ్దుల్లా కొత్త ఫోటోలు
- Yevam Teaser | చాందిని చౌదరి ‘యేవమ్’ టీజర్ రిలీజ్
- Jaguar Land Rover | రేంజ్ రోవర్ కార్లు ఇక ఇండియాలోనే తయారీ.. ధర ఎంత తగ్గుతుందంటే..?!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

