USA vs IRE : టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8 బెర్తు కోసం మరో కీలక పోరు జరుగుతోంది. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఫ్లోరిడా వేదికగా అమెరికా(USA), ఐర్లాండ్(Ireland) తలపడుతున్నాయి. ఊహించినట్టుగానే ఫ్లోరిడా పెద్ద వాన పడింది. దాంతో, ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. అందువల్ల అంపైర్లు షెడ్యూల్ ప్రకారం రాత్రి 7:30 గంటలకు వేయాల్సిన టాస్‌ను వాయిదా వేశారు. ఔట్ ఫీల్డ్ తడి తగ్గాక టాస్ వేయనున్నారు.
ఒకవేళ మళ్లీ వర్షం పడి మ్యాచ్ సాధ్యం కాకుంటే ఇరుజట్లకు చెరొకి పాయింట్ ఇస్తారు. అప్పుడు ఐదు పాయింట్లతో అమెరికా సూపర్ 8కు దూసుకెళ్తుంది. వాన పడకుండా ఉండి మ్యాచ్ జరిగి.. ఐర్లాండ్ ఓడిపోతే యూఎస్ఏ ఆరు పాయింట్లతో ముందుకు వెళ్తుంది. తర్వాత ఐర్లాండ్‌పై పాకిస్థాన్ గెలిచినా ఫలితం ఉండదు.