T20 World Cup 2026 : స్వదేశంలో వచ్చే ఏడాది జరుగబోయే టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) షెడ్యూల్ వచ్చేసింది. శ్రీలంకతో పాటు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న భారత్‌లోని ప్రధాన నగరాల్లో ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ సందడి మొదలవ్వనుంది. నెల రోజులకు పైగా జరిగే ఈ క్రీడా వేడుకను చూసి తరించేందుకు అభిమానులు సిద్ధమవుతున్నారు. మన దేశంలోని ముంబై, కోల్‌కతా, చెన్నై. అహ్మదాబాద్ నగరాలు వేదికలుగా ఎంపికయ్యారు. ఒకప్పుడు ఐసీసీ టోర్నీల మ్యాచ్‌లతో హోరెత్తిపోయిన హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం (Uppal Stadium), బెంగళూరులోని చిన్నస్వామి (Chinnaswamy)కి మాత్రం ఈసారి ఛాన్స్ దక్కలేదు. ఈ రెండు మైదానాలను పక్కన పెట్టేయడానికి కారణాలు లేకపోలేదు. అవేంటో తెలుసా..?
వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఉండే క్రేజే వేరు. అభిమాన ఆటగాళ్ల బ్యాటింగ్ విన్యాసాలు.. ఉత్కంఠ పోరాటాలను కళ్లారా చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు పోటెత్తుతారు. ఇక టీ20 ప్రపంచకప్ అంటే థ్రిల్లింగ్ మామూలుగా ఉండదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మనదేశంలో వరల్డ్ కప్ సంబురం మొదలవ్వనుంది. ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్ నగరాల్లోని జనం విశ్వ క్రీడా వేడుకను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ.. హైదరాబాద్, బెంగళూరులోని అభిమానులు మాత్రం వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం కోల్పోయారు. ఉద్దేశపూర్వంకగానే ఈ రెండింటినీ పక్కన పెట్టేశారా? అంటే.. అవుననే చెప్పాలి. ఎందుకంటే.. గత కొంతకాలంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం(HCA), కర్నాటక క్రికెట్ సంఘం(KSCA) వివాదాల్లో కూరుకుపోయింది.
The schedule for ICC Men’s @T20WorldCup 2026 is here! 📅
The matches and groups were unveiled at a gala event in Mumbai led by ICC Chairman @JayShah, and with new tournament ambassador @ImRo45 and Indian team captains @surya_14kumar and Harmanpreet Kaur in attendance.
✍️:… pic.twitter.com/fsjESpJPlE
— ICC (@ICC) November 25, 2025
కొన్నాళ్లుగా హెచ్‌సీఏలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయి. ఐపీఎల్ 18వ సీజన్లో టికెట్ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంతో గొడవ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. అదనపు టికెట్ల కోసం అప్పటి అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఆరెంజ్ ఆర్మీ యాజమాన్యాన్ని బెదిరించడం.. సీఈఓ కావ్య మారన్ (Kavya Maran) ఏకంగా తాము వేరే సిటీకి వెళ్తామని బీసీసీఐకి లేఖ రాయడం హెచ్‌సీఏ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఆ తర్వాత హైకోర్టు జోక్యంతో సమస్య పరిష్కారమైనా ఆ మరక మాత్రం హెచ్‌సీఏపై అలానే ఉండిపోయింది. ఫలితంగా వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం హైదరాబాద్‌ను పరిశీలించే సాహసం బీసీసీఐ, ఐసీసీ చేయలేకపోయాయని విశ్లేషకులు అంటున్నారు.
క్రికెట్‌ను ఎంతగానే ప్రేమించే బెంగళూరువాసులు కూడా వరల్డ్ కప్ మ్యాచ్‌లు మిస్ అవ్వనున్నారు. చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో జూన్ 4న జరిగిన తొక్కిసలాట(Stampede)నే అందుకు కారణం. తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టు విక్టరీ పరేడ్ 11మంది మృతికి దారితీసింది. ఈ దుర్ఘటనకు కర్నాటక క్రికెట్ సంఘం (KCA) మూల్యం చెల్లించాల్సి వచ్చింది. తొక్కిసలాటను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.
RCB FANS SAID ~ “JUST DON’T GO. IT’S DANGEROUS. VERY DANGEROUS”.
RCB fans outside #ChinnaswamyStadium 🏟️ reveal stampede like situation 👀 pic.twitter.com/BWS9PrbuO5
— Richard Kettleborough (@RichKettle07) June 4, 2025
కమిషన్ తమ నివేదికలో స్టేడియం నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, భారీ సంఖ్యలో అభిమానులను అనుమతించడానికి ఈ గ్రౌండ్ సురక్షితం కాదని స్పష్టం చేసింది. దాంతో.. బెంగళూరు పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) మాత్రం ఇవ్వడం లేదు. దాంతో.. అప్పటి నుంచి ఈ మైదానంలో ఒక్క మ్యాచ్ జరగలేదు. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు వేదికలను ఎంపిక చేసే సమయంలో భద్రతతో పాటు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం పనితీరును కూడా లెక్కలోకి తీసుకుంటారు. అందుకే.. ఉప్పల్, చిన్నస్వామి స్టేడియాలను ఎంపిక చేయలేదని సమాచారం.
పొట్టి ప్రపంచకప్ తొలిపోరు కో-హోస్ట్ శ్రీలంకలోని కొలంబోలో జరుగనుంది. ఆరంభ మ్యాచ్‌లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ ఢీకొంటాయి. ఆరోజు సాయంత్రం 7 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ముంబై వేదికగా పసికూన అమెరికాతో తలపడనుంది. సెమఫైనల్స్కు ముంబై, కోల్‌కతా వేదిక కానున్నాయి. అహ్మదాబాద్‌లో మార్చి 8న ఫైనల్ నిర్వహిస్తారు. దాయాదులు టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15 శ్రీలంకలో జరుగునుంది. ఒకవేళ పాక్ ఫైనల్ చేరితే అహ్మదాబాద్ బదులు కొలంబోలోనే టైటిల్ పోరు నిర్వహిస్తారు.
Pakistan will face Netherlands, West Indies will play Bangladesh, and India will host USA on the opening day of the #T20WorldCup on February 7 📆
The semi-finals will take place in Kolkata/Colombo and Mumbai, with the final on March 8 in Ahmedabad or Colombo pic.twitter.com/s2qvD8aIPe
— ESPNcricinfo (@ESPNcricinfo) November 25, 2025
గ్రూప్ -1 : భారత్, పాకిస్థాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ.
గ్రూప్ -2 : శ్రీలంక, ఆస్ట్రేలియా, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ -3 : ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ -4 : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్థాన్, యూఏఈ, కెనడా.