WPL | బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 177/9 స్కోరు చేసింది. సహచరులు విఫలమైన వేళ లోయార్దర్లో వచ్చిన చినెల్లీ హెన్రీ(62) అర్ధసెంచరీతో జట్టుకు పోరాడే స్కోరు అందించింది.
ఢిల్లీ బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొంటూ హెన్రీ తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 8 భారీ సిక్స్‌లతో కదంతొక్కింది. జొనాసెన్(4/31) నాలుగు వికెట్లతో విజృంభించింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. రోడ్రిగ్స్(56) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. క్రాంతి గౌడ్(4/25), గ్రేస్ హారిస్(4/15) ఢిల్లీ పతనాన్ని శాసించారు. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.