WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో యూపీ వారియర్స్ సంచలనం సృష్టించింది. శుక్రవారం ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో యూపీ 1 పరుగు తేడాతో టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై అద్భుత విజయం సాధించింది. యూపీ నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యఛేదనలో ఢిల్లీ 19.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మెగ్ ల్యానింగ్ (60) అర్ధసెంచరీతో రాణించగా, మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. దీప్తిశర్మ (4-19) నాలుగు వికెట్లతో విజృంభించింది. తొలు త యూపీ 20 ఓవర్లలో 138-8 స్కోరు చేసింది. దీప్తిశర్మ (59) అర్ధసెంచరీతో కదంతొక్కింది. సాధు, రాధా యాదవ్ రెండేసి వికెట్లు తీశారు. దీప్తిశర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.