Unnati Hooda : భారత బ్యాడ్మింటన్‌లో కొత్త తార దూసుకొచ్చింది. ఒలింపిక్ విజేత పీవీ సింధు (PV Sidhu)పై సంచలన విజయంతో వార్తల్లో నిలిచింది ఉన్నాతి హుడా (Unnati Hooda) . చైనా ఓపెన్ 1000 టోర్నమెంట్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో సింధుకు ముచ్చెమటలు పట్టించిన ఈ టీనేజర్ ఉత్కంఠ పోరులో జయభేరి మోగించింది. హోరాహోరీగా తలపడిన ఉన్నాతి 21-16, 19-21, 21-13తో తెలుగు తేజాన్ని ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
అభిమాన ఆటగాళ్లతో ఆడడం.. వాళ్లను ఓడించడం ఎవరికైనా గొప్ప విషయమే. హరియాణాకు చెందిన ఉన్నాతి హుడా కూడా ఇప్పుడు ఆ ఆనందంలోనే ఉంది. అవును.. సింధును రోల్ మోడల్‌గా భావించే ఉన్నాతి షట్లర్‌గా అంచెలంచెలుగా ఎదిగింది. అండర్ -13 జాతీయ స్థాయి పోటీల్లో పతకం గెలిచిన ఉన్నాతి.. అండర్ -15, అండర్ -19 విభాగంలోనూ విజేతగా నిలిచింది. అంతర్జాతీయ టోర్నీల్లోనూ సత్తా చాటుతున్న ఉన్నాతి ఈరోజు తన కెరీర్లో మర్చిపోలేని విక్టరీ సాధించింది.
A new addition to the list of Indian WS players to reach the BWF Super 1000 quarters!
Welcome, Unnati Hooda⬅️#Badminton pic.twitter.com/uvmVEDeaZJ
— BAI Media (@BAI_Media) July 24, 2025
ఆద్యంతం దూకుడుగా ఆడి బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000 ఈవెంట్లో సింధుకు చెక్ పెట్టింది. తద్వారా ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరిన నాలుగో మహిళా షట్లర్‌గా ఉన్నాతి గుర్తింపు సాధించింది. ఆమె కంటే ముందు సైనా నెహ్వాల్, పీవీ సింధు, మాళవికా బన్సోద్ ఈ ఘనతకు చేరువయ్యారు. ఈరోజు నేను గెలుస్తానని అని అనుకోలేదు. సింధును స్ఫూ్ర్తిగా భావించే ఉన్నాతి చైనా ఓపెన్‌లో ఆమెకే చెక్ పెట్టి ఔరా అనిపించింది.