IND vs ENG : నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బజ్ బాల్ ఆటతో రెచ్చిపోతున్న ఇంగ్లండ్ ఓపెనర్ల విధ్వంసానికి బ్రేక్ పడింది. పేసర్లు తేలిపోగా బంతి అందుకున్న రవీంద్ర జడేజా(1-29) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో బౌండరీలతో చెలరేగుతున్న జాక్ క్రాలే(84)ను వెనక్కి పంపాడు. స్లిప్‌లో కేల్ రాహుల్ సూపర్ క్యాచ్ అందుకోవడంతో క్రాలే ఇన్నింగ్స్ ముగిసింది. 166 వద్ద ఆతిథ్య జట్టు తొలి వికెట్ కోల్పోయింది.
భారత పేసర్లు బుమ్రా, సిరాజ్.. అరంగేట్రం కుర్రాడు అన్షుల్ కంభోజ్లను ఉతికేస్తూ ఇంగ్లండ్‌కు శుభారంభమిచ్చారు ఓపెనర్లు. క్రీజులోకి వచ్చిన కొద్ది సేపటికే బౌండరీలతో స్కోర్ బోర్డును జెడ్ స్పీడ్‌తో ఉరికించాడు బెన్ డకెట్. మెరపు ఫిఫ్టీతో భారత బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. మొదట నిదానంగా ఆడిన జాక్ క్రాలే(84) సైతం ఫిఫ్టీ బాదేశాడు.
India finally get the breakthrough 🔥
Ravindra Jadeja picks up Zak Crawley after his fine knock of 8️⃣4️⃣#RavindraJadeja #zakcrawley #ENGvsIND #INDvsENG pic.twitter.com/plBunjUzkV
— Cricbuzz (@cricbuzz) July 24, 2025
ఈ ఇద్దరి విధ్వంసంతో ఆతిథ్య జట్టు స్కోర్ 19 ఓవర్లకే వంద దాటింది. ఈ జోడీని విడదీసేందుకు కెప్టెన్ గిల్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు జడేజా రంగంలోకి దిగి క్రాలే వికెట్‌తో గిల్ బృందానికి బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బెన్ డకెట్ (90) సెంచరీకి చేరువకాగా.. ఓలీ పోప్(4) ఆచితూచి ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ స్కోర్.. 186/1. ఇంకా 172 కొడితే భారత్ స్కోర్ దాటేస్తుంది స్టోక్స్ సేన.