ICC U19 WC | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వచ్చే అండర్-19 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించింది. ఈ టోర్నమెంట్ జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు జింబాబ్వే-నమీబియా వేదికగా జరుగన్నది. ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొంటాయి. ఫైనల్‌తో సహా మొత్తం 41 మ్యాచ్‌లు జరుగుతాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సారి భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను చూడలేం. రెండు వేర్వురు గ్రూప్స్‌లో ఉన్నాయి. అండర్-19 ప్రపంచ కప్‌లో నాలుగు గ్రూపులు ఉంటాయి. ఇందులో నాలుగు జట్లు చొప్పున ఉంటాయి.
గ్రూప్ దశ తర్వాత సూపర్ సిక్స్.. అందులో నుంచి నాలుగు జట్లు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ మ్యాచ్ హరారేలో జరుగుతుంది. టోర్నీలో తొలి మ్యాచ్‌ను భారత్-యూఎస్ఏ మధ్య జరుగుతుంది. రెండో మ్యాచ్ జింబాబ్వే-స్కాట్లాండ్తో తలపడుతుంది. టాంజానియా తొలిసారిగా వరల్డ్ కప్ ఆడబోతున్నది. మొదటి మ్యాచ్‌ను వెస్టిండిస్‌తో ఆడుతుంది. అండర్-19 ప్రపంచ కప్ మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్, తకాషింగా స్పోర్ట్స్ క్లబ్, జింబాబ్వేలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌తో సహా ఐదు వేదికల్లో జరుగుగుతాయి. నమీబియాలో నమీబియా క్రికెట్ గ్రౌండ్, హెచ్‌పీ ఓవల్‌లో వరల్డ్ క్లబ్లో మ్యాచులు జరుగుతాయి.
గ్రూప్-ఏలో భారత్, యూఎస్ఏ, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి. గ్రూప్-బీలో జింబాబ్వే, పాక్తిస్తాన్, ఇంగ్లండ్, స్కాట్లాండ్.. గ్రూప్-సీలో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జపాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. గ్రూప్-డీలో టాంజానియా, వెస్టిండిస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. ఐసీసీ వెబ్సైట్లో టోర్నమెంట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ టోర్నమెంట్లో టాంజానియా అరంగేట్రం చేస్తుండగా.. జపాన్ 2020 తర్వాత మళ్లీ టోర్నీలో అడుగుపడుతున్నది. భారత్ తొలి మ్యాచ్‌ను 15న అమెరికాతో, 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. భారత్ మ్యాచులన్నీ బులవాయో వేదికగా జరుగుతాయి. మొదటి రౌండ్లో గ్రూప్‌లో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్‌లో ఆడుతాయి. ఇందులో ఆరు జట్లను రెండు గ్రూపులుగా విడిపోతాయి.

Under 19 World Cup Schedule
🗓️ Mark your calendars, folks 🥳
A look at #TeamIndia‘s group stage fixtures for ICC U-19 Men’s Cricket World Cup 2026 🙌#U19WorldCup pic.twitter.com/7OGNbvpBTz
— BCCI (@BCCI) November 19, 2025