WPL Points Table : మహిళల ప్రీమియర్ నాలుగో సీజన్ అభిమానులను కావాల్సినంత క్రికెట్ మజాను పంచుతోంది. చూస్తుండగానే పది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఉత్కంఠ పోరాటాలతో, ఆఖరి ఓవర్ థ్రిల్లర్లతో ఆసక్తిగా సాగుతున్న లీగ్‌లో చూస్తుండగానే పది మ్యాచ్‌లు పూర్తయ్యాయి. టైటిల్ బరిలో ఉన్న ఐదు జట్లలో ఓటమన్నది ఎరుగనిది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మాత్రమే. టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) సారథ్యంలో ఆ జట్టు అజేయంగా దూసుకెళ్తోంది. వరుసగా మూడుకు మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో పాతుకుపోయింది ఆర్సీబీ.
డబ్ల్యూపీఎల్ నాలుగో ఎడిషన్‌లో అంచనాలు తలకిందులవుతున్నాయి. మూడు పర్యాయాలు ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఒకేఒక విజయంతో ప్లే ఆఫ్స్ రేసులో వెనబడింది. ఫేవరెట్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రెండు విజయాలు సాధించగా.. గుజరాత్ జెయింట్స్ (Gujarat Gaints) భారీ స్కోర్లతో వరుసగా రెండు మ్యాచుల్లో జయభేరి మోగించింది.
అయితే.. తర్వాతి రెండు మ్యాచుల్లో ముంబై, ఆర్సీబీ చేతిలో కంగుతిన్నది. ఈసారైనా గొప్ప ప్రదర్శన చేయాలుకున్న యూపీ వారియర్స్ (UP Warriorz) రాత మాత్రం మారలేదు. ఈ మెగా టోర్నీలో ఢిల్లీని ఏకంగా మూడుసార్లు ఫైనల్‌కు తీసుకెళ్లిన మేగ్ లానింగ్ ఆ జట్టును మూడు పరాజయాల తర్వాత గెలుపు తోవ తొక్కించింది. లీగ్ దశ చివరి అంకానికి చేరడంతో.. ప్లే ఆఫ్స్ సమీకరనాలు ఆసక్తిగా మారాయి.
RCB are flying 🚀 pic.twitter.com/bTFXnj165j
— ESPNcricinfo (@ESPNcricinfo) January 17, 2026
పది మ్యాచ్‌ల అనంతరం పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. హ్యాట్రిక్ విజయాలతో 6 పాయింట్లు సాధించిన ఆర్సీబీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆడిని మూడు మ్యాచుల్లో జయభేరి మోగించిన బెంగళూరు నెట్ రన్‌రేటు కూడా +1.828 ఉంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆరంభ పోరులో ఓటమి తర్వాత పుంజుకున్న ముంబై.. ఢిల్లీని, గుజరాత్‌ను ఓడించించి. కానీ, శనివారం జరిగిన డబుల్ హెడర్ తొలి మ్యాచ్‌లో యూవీ వారియర్స్ కెప్టెన్ మేగ్ లానింగ్(70) అర్ద శతకంతో మెరవగా.. అనంతరం హర్మన్‌ప్రీత్ సేన 165కే పరిమితమై మ్యాచ్‌ను అప్పగించేసింది. ప్రస్తుతం ముంబై రన్ రేటు +0.151 ఉందంతే.
🔙 to 🔙 victories! 📈@UPWarriorz with a fantastic all-round show to complete the double over Mumbai Indians 💛
Scorecard ▶️ https://t.co/7bDWCP77Em #TATAWPL | #KhelEmotionKa | #UPWvMI pic.twitter.com/FOoJwFB8EJ
— Women’s Premier League (WPL) (@wplt20) January 17, 2026
మొదటి రెండు మ్యాచుల్లో రెండొదలకు పైగా కొట్టి గెలుపొందిన గుజరాత్ జెయింట్స్ అనూహ్యంగా తడబడి మూడో ర్యాంక్ సాధించింది. శుక్రవారం ఆర్సీబీ చేతిలో 32 పరుగుల తేడాతో ఓడిన గార్డ్నర్ టీమ్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నా.. రన్‌రేటు మాత్రం మైనస్(-0.319)లో ఉంది. వరల్డ్‌క్లాస్ బ్యాటర్లు, బౌలర్లు ఉన్నప్పటికీ.. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోతున్న యూపీ వారియర్స్ మూడు ఓటముల తర్వాత పుంజుకుంది.
రెండు విక్టరీలతో నాలుగో స్థానం దక్కించుకుంది. డబ్ల్యూపీఎల్‌లో మూడుసార్లు రన్నరప్‌గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఘోరంగా విఫలమవుతోంది. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) సారథ్యంలో చతికిలపడుతున్న ఢిల్లీ సారథ్యంలో చతికిలపడుతున్న ఢిల్లీ రెండే పాయింట్లతో అట్టడుగున ఉంది.