క్రికెట్లో అందరి కన్నా సహనంగా ఉండే వాళ్లు అంపైర్లే. బౌలర్లు, ఫీల్డర్లు ఎన్నిసార్లు అవుట్ కోసం అప్పీల్ చేసినా బాగా ఆలోచించి నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒక అంపైర్ తన సహనం కోల్పోయిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌లో తను అంపైర్ అనే విషయం మర్చిపోయిన అతను.. తను కూడా అప్పీల్ చేస్తూ ముందుకొచ్చేశాడు.
అయితే తనే అంపైర్ అని గుర్తురావడంతో.. బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ ఘటన ఇంగ్లండ్‌లో జరిగిన ఒక క్లబ్ మ్యాచ్‌లో వెలుగు చూసింది. ఓదిహాం క్రికెట్ క్లబ్, ఓవర్టాన్ క్రికెట్ క్లబ్ మధ్య మ్యాచ్ జరుగుతుండగా.. ఓవర్టాన్ బ్యాటింగ్ చేస్తోంది. 12 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కష్టాల్లో ఉంది. అప్పుడు బౌలర్ వేసిన బంతిని బ్యాటర్ సరిగా ఆడలేకపోయాడు.
దీంతో బంతి నేరుగా వెళ్లి బ్యాటర్ ప్యాడ్లకు తగిలింది. అదే సమయంలో ప్రత్యర్థి జట్టుతోపాటు అంపైర్ కూడా అప్పీల్ చేస్తూ అరిచేశాడు. ఈ వీడియోను ఓదిహాం క్లబ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. మ్యాచ్‌లో ఓవర్టాన్ జట్టు 17 పరుగులకే ఆలౌట్ అవగా.. ఓదిహాం జట్టు రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తను అంపైర్ అనే విషయం మర్చిపోయేంతలా ఆటలో మునిగిపోయాడంటూ.. సదరు అంపైర్‌పై కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
When your umpire is a player and just loves to be involved…. By appealing himself! 🤦🏼 @crickshouts @Frogboxlive @wecricket_ pic.twitter.com/3LAdMDFCg1
— OdihamCricketClub (@OdihamCricket) June 5, 2022