Uma Chetry : భారత క్రికెట్ జట్టులో ఢిల్లీ, ముంబై, పంజాబ్.. రాష్ట్రాల ఆటగాళ్లదే హవా. మహిళల జట్టులో మాత్రం పలు రాష్ట్రాల క్రికెటర్లు ప్రాతినధ్యం వహించేవారు. క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో ఈశాన్య రాష్ట్రాల నుంచి కొత్త తారలు దూసుకొస్తున్నారు. నిరుడు రియాన్ పరాగ్ (Riyan Parag) టీమిండియాకు ఆడగా.. ఇప్పుడు ఉమా ఛెత్రీ (Uma Chetry) వన్డేల్లో అరంగేట్రం చేసింది. ఫుట్‌బాల్, బాక్సింగ్ వంటి ఆటలకు పాపులర్ అయిన ఈశాన్య రాష్ట్రం అస్సాం(Assam) నుంచి టీమిండియా జెర్సీ వేసుకున్న రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది ఉమ.
పదమూడో సీజన్ వన్డే ప్రపంచకప్‌లో వికెట్ కీపర్ రీచా ఘోష్(Richa Ghosh) గాయపడడంతో ఛెత్రీకి అవకాశం దక్కింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో చివరి లీగ్ మ్యాచ్‌కు ముందు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన నుంచి డెబ్యూట్ క్యాంప్ అందుకుందీ యంగ్‌స్టర్. తద్వారా మహిళల వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన 157వ ప్లేయర్‌గా ఛెత్రీ నిలిచింది. ఆమె కంటే ముందు అస్సాం నుంచి రితూ ధ్రుబ్ (Ritu Dhrub) 2013-14లో వన్డే, టీ20ల్లో తొలి మ్యాచ్ ఆడింది. ఐపీఎల్లో చెలరేగి ఆడుతున్న రియాన్ పరాగ్ పురుషుల జట్టు తరఫున 2024లోనే అరంగేట్రం చేశాడు. శ్రీలంకపై తొలి వన్డే ఆడాడీ అస్సామీ క్రికెటర్.
ODI debut in a World Cup game ✨👌
Special moment as debutant Uma Chetry receives her ODI cap from vice-captain Smriti Mandhana 🧢
Updates ▶️ https://t.co/lkuocSlGGJ#TeamIndia | #WomenInBlue | #CWC25 | #INDvBAN pic.twitter.com/nt1Qn6Md8G
— BCCI Women (@BCCIWomen) October 26, 2025
గోలాఘట్ జిల్లాలోని కండులిమరి ఉమ సొంతూరు. చిన్నప్పటి నుంచి క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకున్న ఆమె భారత ‘ఏ’ జట్టుకు ఆడింది. దేశవాళీ క్రికెట్లో బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లోనూ అదరగొట్టింది. అంతటితోనే ఆగకుండా సీనియర్ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించాలని కలలు కనేది. అనుకున్నట్టే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చేసింది అస్సామీ. అది కూడా వన్డే ప్రపంచ కప్‌లో అరంగేట్రం అంటే మామూలు విషయం కాదు. అంతేకాదు మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లో ఫ్రాంఛైజీల దృష్టిలో పడిందీ యువకెరటం. డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ (UP Warriorz) తరఫున మెరిసింది.
వికెట్ కీపర్ అయిన ఉమా ఛెత్రీ ఇదివరకే దక్షిణాఫ్రికా(South Africa)తో టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేసింది. రెగ్యులర్ వికెట్ కీపర్ యస్తికా భాటియా (Yastika Bhatia) గాయపడడంతో సెలెక్టర్లు ఉమకు అవకాశమిచ్చారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిన ఆమెకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himantha Biswa Sarma) ఎక్స్ వేదికగా ఉమకు కంగ్రాట్స్ చెప్పారు. అయితే.. ఉమ తుది జట్టులో చోటు దక్కించుకున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
The feeling of making your international Debut 🤗
Congratulations Uma Chetry 👏👏
Follow the match ▶️ https://t.co/wykEMCyvIl#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/XrNMeoeYme
— BCCI Women (@BCCIWomen) July 7, 2024