న్యూఢిల్లీ: అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) ఆరో సీజన్‌కు వేళయైంది. అహ్మదాబాద్ వేదికగా మే 29 నుంచి జూన్ 15వ తేదీ వరకు లీగ్ జరుగుతుందని నిర్వాహకులు శుక్రవారం పేర్కొన్నారు. స్థానిక ఈకేఏ ఎరీనా వేదికగా జరుగనున్న లీగ్‌లో మొత్తం 8 జట్లు పోటీపడనున్నాయి.
ఇందులో ఆతిథ్య భారత్‌తో పాటు పలు దేశాలకు స్టార్ ప్లేయర్లతో పాటు యువ ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. లీగ్ ద్వారా విదేశీ ప్లేయర్లతో పోటీపడే అవకాశం లభించిందని జాతీయ టీటీ అసోసియేషన్ కార్యదర్శి కమలేశ్ మెహతా పేర్కొన్నారు. రానున్న సీజన్లో ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడనున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ గోవా చాలెంజర్స్ ముచ్చటగా మూడో టైటిల్‌పై కన్నేసింది.