T20 World Cup 2024 : తొలిసారి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న ఉగాండా(Uganda) జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC)భారీ షాకిచ్చింది. మరో రెండు రోజుల్లో ప్రపంచ కప్ మొదలవ్వనుందనగా ఆ టీమ్ జెర్సీ (Jersey)పై తిరకాసు పెట్టింది. ఆ జట్టు జెర్సీపై స్పాన్సర్ల లోగో కనిపించడం లేదని వెంటనే డిజైన్ మార్చుకోవాలని సూచించింది. దాంతో, చేసేదేమీలేక ఉగాండా క్రికెట్ బోర్డు జెర్సీలో మార్పులు చేసింది.
తొలుత ఉగాండా బోర్డు పసుపు రంగు జెర్సీని విడుదల చేసింది. భుజాలపై తమ దేశ జాతీయ పక్షి ఆనవాళ్లకు గుర్తుగా బూడిద రంగు కొంగ(Grey Crowned Crane)ను పోలిన రంగులతో జెర్సీ తయారు చేసింది. కానీ, ఈకల రంగు రంగు కారణంగా వరల్డ్ కప్ స్పాన్నర్ల లోగో అంతగా హైలైట్ కావడం లేదు.
Uganda are ready for the #T20WorldCup 🇺🇬💥 pic.twitter.com/jQ56ibchrO
— ICC (@ICC) May 29, 2024
దాంతో, ఉగాండా జట్టు జెర్సీపై అభ్యంతరం తెలిపిన ఐసీసీ చేయాల్సిన మార్పులు చెప్పింది. దాంతో, భుజాలపై ఉన్న తమ జాతీయ పక్షి రంగును మొత్తానికి ఎత్తేసి.. పూర్తిగా పసుపు రంగు జెర్సీని ఆవిష్కరించింది. ఇదే జెర్సీతో ఉగాండా మెగా టోర్నీలో ఆడనుంది.
ఉగాండా వరల్డ్ కప్ స్క్వాడ్ : బ్రియాన్ మసబ(కెప్టెన్), సిమన్ సెసాజీ, రోజెర్ ముకాసా, కాస్మస్ కీవుట, దినేశ్ నక్రాని, ఫ్రెడ్ అచెలామ్, కెన్నెత్ వైస్వా, అల్పేశ్ రమ్జానీ, ఫ్రాంక్ సుబుగ, మెన్రీ సెన్యొడో, బిలాల్ హస్సున్, రాబిన్సన్ ఒబుయ, రియాజట్ అలీ షా, జుమా మియాజీ, రోనక్ పటేల్.