Asia Cup | ఆసియా కప్‌లో భాగంగా పాక్తిస్తాన్-యూఏఈ మధ్య మ్యాచ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. పీసీబీ బాయ్డ్రామ్ నేపథ్యంలో మ్యాచ్ ఆలస్యమైంది. షేక్‌హ్యాండ్ వివాదం నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను రిఫరీగా తప్పించాలని పీసీబీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఐసీసీ రిఫరీని మార్చే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, మరోసారి ఐసీసీకి పీసీబీ మెయిల్ చేసింది.
పైక్రాఫ్ట్‌ను తొలగించకుంటే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బెదిరింపులకు దిగింది. అయినా, ఐసీసీ వెనక్కి తగ్గకపోవడంతో పాకిస్తాన్ జట్టు ఆలస్యంగా మైదానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచి యూఏఈ కెప్టెన్ మహ్మద్ వసీం తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక మ్యాచ్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ కొనసాగనున్నారు. ఈ మ్యాచ్ కోసం పాక్ జట్టులో రెండు మార్పులు చేసింది. సుఫ్యాన్ ముఖీమ్, ఫహీమ్ అష్రఫ్‌ను పక్కన పెట్టింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు: అలీషాన్ షరాఫు, మహ్మద్ వసీం (కెప్టెన్), ఆసిఫ్ ఖాన్, మహ్మద్ జోహైబ్, హర్షిత్ కౌశిక్, రాహుల్ చోప్రా (వికెట్ కీపర్), ధ్రువ్ పరాషర్, హైదర్ అలీ, మహ్మద్ రోహిద్ ఖాన్, సిమ్రంజీత్ సింగ్, జునైద్ సిద్ధిఖీ.
పాకిస్తాన్ జట్టు: సైమ్ అయూబ్, ఎస్ ఫర్హాన్, మహ్మద్ హరిస్ (వికెట్ కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), ఖుష్దిల్ షా, హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, షహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.