T20 World Cup 2026 : వచ్చే ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్ కప్ బెర్తులు ఖరారయ్యాయి. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈమెగా టోర్నీలో పోటీ పడనున్న 20 జట్టుగా యూఏఈ (UAE) నిలిచింది. తూర్పు ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్‌లో జపాన్‌పై విజయంతో ప్రపంచ కప్ బరిలోకి దూసుకొచ్చింది యూఏఈ. ఇదే క్వాలిఫయర్‌లో అదరగొట్టిన పసికూనలు నేపాల్ 18వ జట్టుగా, ఒమన్ 19వ జట్టుగా ఈ విశ్వక్రీడా సమరానికి అర్హత సాధించాయి.
పదో సీజన్ పొట్టి వరల్డ్ కప్ పోటీలు 2026 ఫిబ్రవరి – మార్చిలో జరుగనున్నాయి. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక ఆతిథ్య జట్లుగా క్వాలిఫై అయ్యాయి. నిరుడు జరిగిన ప్రపంచ కప్‌లో టాప్-7లో నిలిచిన అఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్‌లకు నేరుగా బెర్తు దక్కింది.
The 20 teams at next year’s men’s T20 World Cup:
🇮🇳 India
🇱🇰 Sri Lanka
🇦🇫 Afghanistan
🇦🇺 Australia
🇧🇩 Bangladesh
🏴 England
🇿🇦 South Africa
🇺🇸 USA
🏝️ West Indies
☘️ Ireland
🇳🇿 New Zealand
🇵🇰 Pakistan
🇨🇦 Canada
🇮🇹 Italy
🇳🇱 Netherlands
🇳🇦 Namibia
🇿🇼 Zimbabwe
🇳🇵 Nepal
🇴🇲 Oman
🇦🇪… pic.twitter.com/Mmar8uXKKx— ESPNcricinfo (@ESPNcricinfo) October 16, 2025
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ అర్హత సాధించాయి. ఆఫ్రికా క్వాలిఫయర్స్ ద్వారా నమీబియా, జింబాబ్వే వరల్డ్ కప్ బరిలోకి వచ్చాయి. యూరప్ క్వాలిఫయర్స్‌లో అదరగొట్టిన ఇటలీ, నెదర్లాండ్స్.. అమెరికన్ క్వాలిఫయర్స్ నుంచి కెనడాలు క్వాలిఫై అయ్యాయి. ఇక చివరి క్వాలిఫయర్ టోర్నీ అయిన తూర్పు ఆసియా ఫసిఫిక్ నుంచి ఒమన్ నేపాల్ యూఏఈలు ప్రపంచ కప్‌లో పోటీపడే అవకాశాన్ని పట్టేశాయి.
వరల్డ్ కప్‌లో ఆడనున్న జట్లు : భారత్, శ్రీలంక (ఆతిథ్య దేశాలు), ఆస్ట్రేలియా, అఫ్గనిస్థాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, నమీబియా, జింబాబ్వే, నేపాల్, ఒమన్, యూఏఈ.