India vs Pakistan | అండర్ 19 వరల్డ్ కప్.. పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు చేరిన టీమిండియా
India vs Pakistan : అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ సిక్స్ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
India vs Pakistan : అండర్ 19 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ సిక్స్ మ్యాచులో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో టోర్నీలో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. పాక్‌పై 58 పరుగుల తేడాతో ఇండియా భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది.
ఇండియా బ్యాటర్లలో వేదాంత్ త్రివేది 68 పరుగులు (98 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్) చేయగా, వైభవ్ సూర్యవంశీ 30 పరుగులు (22 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో రాణించారు. తర్వాత బ్యాటర్లు తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. చివర్లో కనిష్క్ చౌహాన్ మాత్రం చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 35 పరుగులు చేశాడు. అలాగే ఖిలాన్ పటేల్ కూడా 15 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 21 పరుగులు చేయడంతో ఇండియా గౌరవప్రదమైన 252 పరుగుల స్కోరు చేసింది. తర్వాత 253 పరుగుల స్వల్ప లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన పాకిస్తాన్ చతికిలపడిపోయింది. 46.2 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటైంది.
పాక్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్ 66 పరుగులు చేయగా, హంజా జహూర్ 42 పరుగులు, ఫర్హాన్ యూసఫ్ 38 పరుగులు చేశారు. కానీ, మిగతా బ్యాటర్లు తక్కువ పరుగులకే ఔటయ్యారు. దీంతో పాక్ స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. భారత బౌలర్లు ఖిలాన్ పటేల్, ఆయుష్ మాత్రే తలో మూడు వికెట్లు పడగొట్టగా, హెనిల్ పటేల్, కనిష్క్ చౌహాన్, విహాన్ తలో వికెట్ తీశారు. ఫలితంగా 58 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

