పోచెఫ్స్ట్రామ్ : మహిళల అండర్-19 క్రికెట్ టీ20 ప్రపంచకప్లో శనివారం భారత్కు తొలి ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో షెఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 18.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌటైంది. శ్వేతా షెరావత్(21) అత్యధిక పరుగులు చేసింది. సియాన జింజర్ (3/13), మిలి ఇల్తింగ్వర్త్(2/12), మాగీ క్లార్క్(2/18) చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 13.5 ఓవర్లలో 3 వికెట్లకు 88 పరుగులు చేసింది. అమి స్మిత్(26నాటౌట్) అత్యధిక స్కోరర్ కాగా, ైక్లెర్ మూర్ (25నాటౌట్), కేట్ పెల్లె (17) రాణించారు.