బ్యాంకాక్ : ఆసియా అండర్-19, 22 బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ బాక్సర్ల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో అండర్-22 విభాగంలో సుమారు డజనుకుపైగా పతకాలు ఖాయమవగా మంగళవారం జరిగిన అండర్-19 విభాగంలో ఏకంగా ఏడుగురు అమ్మాయిలు సెమీస్ చేరుకుని పతకాలు ఖాయం చేసుకున్నారు.
మంగళవారం జరిగిన క్వార్టర్స్ పోరులో యక్షిత (51 కిలోలు), నిషా (54 కి.), ముస్కాన్ (57 కి.), విని (60 కి.), ఆకాంక్ష (70 కి.), ఆర్తి కుమారి (75 కి.) తమ ప్రత్యర్థులను చిత్తుచేసి సెమీస్ చేరారు.