కొల్లామ్: కేరళలో ఇద్దరు మైనర్ అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. కొల్లాంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్(Sports Hostel) రూమ్‌లో వాళ్లు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం ఈ ఘటన జరిగింది. ఆ టీనేజ్ అథ్లెట్లు శాయ్ హాస్టల్లో శిక్షణ పొందుతున్నారు. ఒకరు కోచికోడ్, మరొకరు తిరువనంతపురంకు చెందినవారు. ఓ అమ్మాయి 12వ తరగతి చదువుతున్నది. ఆమె అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతోంది. మరో అమ్మాయి 10వ తరగతి చదువుతోంది. ఆమె కబడ్డీలో శిక్షణ పొందుతున్నది.
తెల్లవారుజామున 5 గంటల ఆ ఇద్దరు అమ్మాయిలు మరణించిన వార్త బయటకు వచ్చింది. మార్నింగ్ ట్రైనింగ్ సెషన్‌కు రాకపోవడంతో వారి గురించి ఆరా తీశారు. రూమ్ డోరు ఎంతకీ తెరువకపోవడంతో.. హాస్టల్ అధికారులు డోర్‌ను ఓపెన్ చేశారు. సీలింగ్ ఫ్యాన్‌కు ఇద్దరు ఉరి వేసుకున్నారు. కొల్లాం ఈస్ట్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఏ కారణం చేత ఆత్మహత్య చేసుకున్నారో తెలియడం లేదు.
ఈ ఘటన పట్ల దర్యాప్తు చేపడుతున్నట్లు కొల్లామ్ సిటీ పోలీసు కమీషనర్ కిరణ్ నారాయణన్ తెలిపారు. రూమ్‌లో ఎటువంటి సూసైడ్ నోట్ కూడా దొరకలేదు.