ICC Women’s Player of the Month | ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయిన మహిళా క్రికెటర్లు వీళ్లే
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జనవరి) అవార్డుకు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు ఫొబే లిచ్ఫీల్డ్, బేత్ మూనీ నామినేట్ అయ్యారు. అండర్ -19 టీ20 వరల్డ్ కప్లో అదరగొట్టిన ఇంగ్లండ్ ఆల్రౌండర్ గ్రేస్ స్క్రివిన్స్ కూడా పోటీలో నిలిచింది.
ICC Women’s Player of the Month : ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ఇద్దరు ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు చోటు దక్కింది. ఫొబే లిచ్ఫీల్డ్, బేత్ మూనీ జనవరి నెలకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు నామినేట్ అయ్యారు. అండర్ -19 టీ20 వరల్డ్ కప్లో అదరగొట్టిన ఇంగ్లండ్ క్రికెటర్ గ్రేస్ స్క్రివిన్స్ కూడా పోటీలో నిలిచింది. ఆసీస్ నయా సంచలనం లిచ్ఫీల్డ్ జనవరిలో పాకిస్థాన్ సిరీస్లో 154 రన్స్ చేసింది. బ్రిస్బేన్లో జరిగిన తొలి మ్యాచ్లో 78 పరుగులతో నాటౌట్గా నిలిచింది. మూడు వన్డేల్లో ఆమె ఒకసారి మాత్రమే ఔట్ అయింది. బేత్ బూనీ పాక్ సిరీస్లో చెలరేగింది. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ బాదిన ఆమె (57 నాటౌట్) మూడో వన్డేలో శతకం సాధించింది. , ఆసీస్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది.
అండర్ -19 వరల్డ్ కప్లో
ఇంగ్లండ్ ఆల్రౌండర్ గ్రేస్ స్క్రివిన్స్ ఈమధ్యే ముగిసిన అండర్ -19 టీ20 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించింది. దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన తొలి అండర్ -19 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ ఫైనల్ చేరడంలో ఆమె పాత్ర ఎంతో ఉంది. ఈ టోర్నీలో గ్రేస్ మూడు హాఫ్ సెంచరీలు బాదిన ఆమె 293 రన్స్ చేసింది. అంతేకాదు బంతితోనూ రాణించి 9 వికెట్లు పడగొట్టింది. అయితే.. షఫాలీవర్మ కెప్టెన్సీలోని యువ భారత్ ఫైనల్లో ఇంగ్లండ్ను చిత్తుగా ఓడించి ఛాంపియన్గా అవతరించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

