జమైకా స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ప్రేయసి కాసి బెనెట్ కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగపిల్లలు పుట్టినట్లు ఫాదర్స్ డే సందర్భంగా బోల్ట్ ప్రకటించాడు. బెనెట్‌తో పాటు పిల్లలు ఉన్న ఫొటోను బోల్ట్.. సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ సెయింట్లియో బోల్ట్, థండర్ బోల్ట్ పేర్లు పెట్టినట్లు తెలిపాడు.