హైదరాబాద్, ఆట ప్రతినిధి: వారం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న కేఎస్‌జీ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్(జేపీఎల్) శనివారం ముగిసింది. స్థానిక ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీవీ9 12 పరుగుల తేడాతో ఎన్టీవీపై ఉత్కంఠ విజయం సాధించింది. ఆఖరి వరకు ఇరు జట్లు గెలుపు కోసం హోరాహోరీగా తలపడ్డాయి. కిరణ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’, జగదీశ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కాయి. ముగింపు కార్యక్రమానికి హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు, ఉపాధ్యక్షుడు దల్జీత్‌సింగ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ హాజరై విజేత, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు ప్రదానం చేశారు. మ్యాచ్ అనంతరం స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ తెలంగాణ(ఎస్‌జేఏటీ) తరఫున పది మంది దివ్యాంగ ప్లేయర్లకు నగదు ప్రోత్సాహ చెక్కు లు అందించారు. ఈ కార్యక్రమంలో స్పాన్సర్లు సంజయ్, భరత్‌రెడ్డి, భరణి, శరత్ తదితరులు పాల్గొన్నారు.